Bhartrihari Neeti Shatakam: వారే ధీరులు...

ABN , First Publish Date - 2022-11-18T02:56:56+05:30 IST

ఈ శ్లోకాన్ని... ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్‌ ధీరుల్‌ విఘ్న నిహన్యమానులగుచున్‌ ధ్రుత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్‌ గావునన్‌ ..

Bhartrihari Neeti Shatakam: వారే ధీరులు...

సుభాషితం

ప్రారభ్యతే నఖలు విఘ్నభయేన నీచైః

ప్రారభ్య విఘ్నవిహతా విరమన్తి మధ్యాః

విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః

ప్రారబ్ధముత్తమ జనాః న పరిత్యజన్తి

భర్తృహరి నీతి శతకంలో సుప్రసిద్ధ శ్లోకాలలో ఇదొకటి.

ఈ శ్లోకాన్ని... ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్‌ ధీరుల్‌ విఘ్న నిహన్యమానులగుచున్‌ ధ్రుత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్‌ గావునన్‌ .. అంటూ ఏనుగు లక్ష్మణకవి ఎంతో సరళంగా తెలుగువారికి అందించారు.

‘‘ఏదైనా పని మొదలుపెట్టాలనుకొని, ఆటంకాలు కలుగుతాయనే భయంతో... నీచులైనవారు అసలు ఆ పనే ఆరంభించరు. కార్యాన్ని మొదలుపెట్టాక... అవరోధం ఎదురైతే... మధ్య తరహా మనుషులు ఆ పనిని మధ్యలోనే వదిలేస్తారు. ధీరోదాత్తులు ఎన్ని కష్టాలూ, ఆటంకాలూ. ఇబ్బందులూ ఎదురైనా చలించరు, చేపట్టిన కార్యాన్ని పూర్తి చేసేవరకూ విశ్రమించరు... ఎందుకంటే వారు అపారమైన ప్రజ్ఞ ఉన్నవారు కనుక’’ అని భావం.

Updated Date - 2022-11-18T02:56:57+05:30 IST