నైట్‌ పార్టీల్లో వెలిగిపోవాలంటే...

ABN , First Publish Date - 2022-09-17T07:55:55+05:30 IST

డేటైమ్‌ పార్టీలకూ, నైట్‌ పార్టీలకూ వ్యత్యాసం ఉంటుంది. మిరుమిట్లు గొలిపే లైట్ల వెలుగుల్లో ప్రత్యేకంగా కనిపించాలంటే బేసిక్‌ మేకప్‌కు బదులుగా నైట్‌ పార్టీ మేకప్‌ ఎంచుకోవాలి.

నైట్‌ పార్టీల్లో వెలిగిపోవాలంటే...

డేటైమ్‌ పార్టీలకూ, నైట్‌ పార్టీలకూ వ్యత్యాసం ఉంటుంది. మిరుమిట్లు గొలిపే లైట్ల వెలుగుల్లో ప్రత్యేకంగా కనిపించాలంటే బేసిక్‌ మేకప్‌కు బదులుగా నైట్‌ పార్టీ మేకప్‌ ఎంచుకోవాలి.


లిప్‌ షేడ్‌: పగటి వేళ న్యూడ్‌ బీజ్‌ లాంటి రంగులతో మేకప్‌ను మ్యానేజ్‌ చేయవచ్చు. కానీ రాత్రి వేళ ముదురు ఎరుపు రంగు లిప్‌స్టిక్స్‌ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. 

ఐ షాడో: లైట్ల వెలుగులో తారలా వెలిగిపోవాలంటే ఐ షాడోకు కూడా మెరుపులు జోడించాలి. అందుకోసం గ్లిట్టర్‌ వాడుకోవాలి.

బేస్‌ ఫిక్స్‌: మేకప్‌ చెక్కుచెదరకుండా ఉండడం కోసం మేకప్‌ సెట్టింగ్‌ స్ర్పే వాడుకోవాలి. లేదంటే, ఫౌండేషన్‌ మీద కాంపాక్ట్‌ పౌడర్‌ అద్దుకోవాలి. అలాగే బేస్‌ను ఫిక్స్‌ చేయడం కోసం కొంత ఫౌండేషన్‌, బ్యూటీ బ్లెండర్‌ కలిపి వాడుకోవాలి. 

ఐలైనర్‌: మేకప్‌ లుక్‌ అదిరిపోవాలంటే కనురెప్పలకు నియాన్‌ ఐలైనర్‌ అప్లై చేయాలి. 

చెక్కిన లుక్‌: ముక్యూ, చుబుకం, కనుబొమలు స్పష్టంగా చెక్కినట్టు కనిపించడం కోసం బ్రాంజర్‌తో కాంటూర్‌ చేసుకోవాలి.

బ్లషర్‌: సాధారణంగా బ్లషర్‌ కొన్ని గంటలకే చెదిరిపోతూ ఉంటుంది. కాబట్టి చెక్కిళ్లకు కూడా బ్లషర్‌ అప్లై చేయడం మర్చిపోకూడదు. 

ఐల్యాషెస్‌: ఫాల్స్‌ ఐ ల్యాషెస్‌ ఉపయోగించవచ్చు. ఇష్టం లేకపోతే డ్రమాటిక్‌ మస్కారా అప్లై చేయాలి.

హైలైటర్‌: ఈ బ్లైండింగ్‌ హైలైటర్‌ను చెక్కిళ్లు, బ్రో బోన్‌ మీద అద్దుకోవాలి. 

Read more