సంక్రాంతి వేళ.. ఇంటికి వన్నెతెచ్చేద్దామిలా!

ABN , First Publish Date - 2022-12-05T19:09:39+05:30 IST

సంక్రాంతికి కౌంట్‌డౌన్ మొదలైంది. తెలుగు ప్రజల అతిపెద్ద పండుగల్లో ఇది ఒకటి. ఈ పండుగకు చాలా ప్రత్యేకత ఉంది.

సంక్రాంతి వేళ.. ఇంటికి వన్నెతెచ్చేద్దామిలా!

సంక్రాంతికి కౌంట్‌డౌన్ మొదలైంది. తెలుగు ప్రజల అతిపెద్ద పండుగల్లో ఇది ఒకటి. ఈ పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. భోగిమంటలు, కొత్త అల్లుళ్ల సందడి, కొత్త పంట రాక.. ఇలా అన్నీ ప్రత్యేకతలే. మరి అంతటి ప్రత్యేకత ఉన్న ఈ పండుగ వేళ ఇంటిని సరిగా అలంకరించుకోకపోతే వేడుకలు అసంపూర్తిగా మిగిలిపోతాయి. అయితే, హోం రెనోవేషన్ అనగానే చాలామంది వెనకడుగు వేస్తుంటారు. అందుకు అధిక సమయం ఖర్చుకావడం, అసౌకర్యం వంటివి వెనకడుగు వేసేందుకు కారణం అవుతాయి. అయితే, సరైన ప్రణాళిక, సృజనాత్మకత, ఇంటీరియర్ డిజైన్‌లపై కొంత అవగాహన ఉంటే అతి తక్కువ సమయంలోనే ఇంటిని అందంగా, విలాసవంతంగా మార్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం!

డిజైనర్ ఫాల్స్ సీలింగ్

ఇంటి అందానికి వన్నె తెచ్చే వాటిలో ఫాల్స్ సీలింగ్‌ది ప్రముఖ పాత్ర. కొన్నిసార్లు దీనిని ఇంట్లో రంగులు వేయడం కంటే కూడా త్వరగా పూర్తి చేయొచ్చు. ఈ డిజైనర్ సీలింగ్‌లో లైట్లను కూడా అమరిస్తే ఇల్లు మరింత ప్రకాశవంతంగా మారుతుంది. అయితే, ఈ రెనోవేషన్ ప్రాజెక్టులో అత్యుత్తమ భాగస్వామిని కనుగొనడం ఎలా అన్నదే అసలు సమస్య. ఇలాంటి సమస్యలకు సెయింట్ గోబైన్ (SAINT-GOBAIN) జిప్రోక్ చక్కని పరిష్కారం కాగలదు. అందుబాటులో ఉన్న విలాసవంతమైన సీలింగ్‌ డిజైన్లను దీనివద్ద పుష్కలంగా ఉన్నాయి.

వారం రోజుల్లోనే మీ సీలింగ్‌కు ఇది నూతన అందాన్ని తీసుకొస్తుంది. అంతేకాదు, ఖర్చును కూడా ఇది గణనీయంగా తగ్గిస్తుంది. ఇంటిని రీమోడల్ చేయడం, లేదంటే పార్టిషన్ చేయాలనుకుంటే అదనపు బెడ్‌రూమ్‌, స్టడీ ఏరియా, పూజా ప్రాంతంలో డ్రై వాల్‌ పార్టిషన్‌ ఓ చక్కటి ఎంపిక అవుతుంది. ఇది అతి తక్కువ ధరలో అధిక మన్నికను కూడా అందిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా సిమెంట్‌, ఇటుక గోడలకు ఆదరణ తగ్గుతోంది. దీనికి తోడు డ్యామేజీ, క్రాక్స్‌, ఫ్లాకింగ్‌ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. వీటికి పరిష్కారమే జిప్సం డ్రై వాల్స్‌. ఇవి పర్యావరణ అనుకూలం కూడా.

గది అందంగా ఉండాలంటే తొలుత ఫ్లోరింగ్ అందంగా ఉంది. అయితే, చాలామంది ఫ్లోరింగ్‌ను పెద్దగా పట్టించుకోరు. ఇంటిని రీమోడలింగ్‌ చేసేటప్పుడు ఫ్లోరింగ్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఫ్లోరింగ్ ఆకట్టుకునేలా ఉండాలంటే కార్పెట్‌, రగ్‌‌ను జోడించొచ్చు. ఇలాంటి మార్పులతో మకర సంక్రాంతి వేళ మీ ఇల్లు మరింత ఆకర్షణీయంగా మారుతుంది.

Updated Date - 2022-12-05T19:09:42+05:30 IST