Muhammad Pavartha: వ్యామోహాలు వదులుకోవాలి

ABN , First Publish Date - 2022-12-15T22:13:21+05:30 IST

ఇహలోకాన్ని ప్రేమిస్తూ, ఇదే శాశ్వతం అనుకొనేవారు పరలోకాన్ని నష్టపరుచుకుంటారనీ, ఎప్పటికైనా అంతమైపోయే ఐహిక జీవితం కన్నా... శాశ్వతమైన పరలోక జీవితానికి ప్రాధాన్యం ఇవ్వాలనీ ‘హదీస్‌’ తదితర ఇస్లాం పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి.

Muhammad Pavartha: వ్యామోహాలు వదులుకోవాలి

సందేశం

ఇహలోకాన్ని ప్రేమిస్తూ, ఇదే శాశ్వతం అనుకొనేవారు పరలోకాన్ని నష్టపరుచుకుంటారనీ, ఎప్పటికైనా అంతమైపోయే ఐహిక జీవితం కన్నా... శాశ్వతమైన పరలోక జీవితానికి ప్రాధాన్యం ఇవ్వాలనీ ‘హదీస్‌’ తదితర ఇస్లాం పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. ‘‘ఈ ప్రపంచం మధురమైనది. సస్యశ్యామలమైనది. ఇటువంటి ప్రపంచంలో తన ప్రతినిధులుగా దేవుడు పుట్టించి, మీరు ఎలా పని చేస్తారో పరీక్షిస్తున్నాడు. కాబట్టి ప్రాపంచిక విషయాల్లో అప్రమత్తంగా ఉండండి’’ అని అవి సూచిస్తున్నాయి. మరి ఈ ప్రపంచంలో ఏ విధంగా జీవించాలి?

ఒక సందర్భంలో మహా ప్రవక్త మహమ్మద్‌... తనకు సన్నిహితుడైన అబ్దుల్లా బిన్‌ ఒమర్‌తో మాట్లాడుతూ ‘‘ఈ ప్రపంచంలో ఒక అపరిచిత వ్యక్తిలా, బాటసారిలా జీవితం గడుపు. సాయం త్రం గడిపాక... పగలు కోసం ఎదురుచూడకు. పగలు గడిచాక... సాయంత్రం కోసం నిరీక్షించకు. వ్యాధికి పూర్వం ఆరోగ్యాన్నీ, మరణానికి పూర్వం దైవం ప్రసాదించిన జీవితాన్నీ మహాభాగ్యాలుగా భావించు’’ అని బోధించారు. ప్రాపంచికమైన సంపదల వ్యామోహంలో పడితే నాశనం తప్పదని మరో సందర్భంలో చెప్పారు. కాబట్టి పరలోక సాఫల్యం కోసం ఇహలోకంలో పాటుపడడం బుద్ధిమంతుల లక్షణం. వ్యామోహాలను వదులుకుంటేనే ఆ సాఫల్యం దక్కుతుంది.

ఫ మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2022-12-15T22:13:22+05:30 IST