యూజర్లు మెచ్చినమొబైల్‌ ఫోన్లు

ABN , First Publish Date - 2022-12-31T04:12:19+05:30 IST

ట్రెండ్‌ను ప్రతిబింబించే వాటిలో స్మార్ట్‌ ఫోన్లు ఒకటి. ముఖ్యంగా అలా్ట్ర - ప్రీమియం ఫోన్లు స్టేటస్‌ సింబల్‌గా మారాయంటే అతిశయోక్తి కాదు.

యూజర్లు మెచ్చినమొబైల్‌ ఫోన్లు

ట్రెండ్‌ను ప్రతిబింబించే వాటిలో స్మార్ట్‌ ఫోన్లు ఒకటి. ముఖ్యంగా అలా్ట్ర - ప్రీమియం ఫోన్లు స్టేటస్‌ సింబల్‌గా మారాయంటే అతిశయోక్తి కాదు. అలా ఈ ఏడాది పాపులర్‌ అయిన వాటిలో కొన్ని ..

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22 అలా్ట్ర: టాప్‌ ఎండ్‌ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 5జీ కనెక్టివిటీ, 100ఎక్స్‌ జూమ్‌ కెమెరా, బిల్ట్‌ ఇన్‌ ఎస్‌-పెన్‌కు తోడు అయిదేళ్ళపాటు ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ సపోర్టు ఉంది. 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌ బేస్‌ రేటు రూ.1,09,000 కాగా 512 జీబీ వేరియంట్‌ రేటు రూ.1,18,999. రెంటిలోనూ 12జీబీ ర్యామ్‌ ఉంది.

గూగుల్‌ పిక్సెల్‌ 7ప్రొ: గూగుల్‌ తన ప్రధాన ఫోన్‌ సిరీస్‌ పిక్సెల్‌ 7, పిక్సెల్‌ 7ప్రొ - రెంటినీ భారత్‌ లో నాలుగేళ్ళ గ్యాప్‌ తరవాత విడుదల చేసింది. పోటీదారులతో పోల్చుకుంటే కొద్దిగా సరసమైన రేటు కే ఈ ఫోన్‌ రూ.84,999కి ఇస్తోంది. పిక్సెల్‌ కావడం తో లేటెస్ట్‌ ఆండ్రాయిడ్‌ ఆప్డేట్స్‌ అన్నీ ఈ డివైస్‌లకే మొదట అందుతున్నాయి. మంచి కెమెరా వ్యవస్థకు తోడు బ్రిలియంట్‌ ఏఐ, ఎంఎల్‌ సామర్థ్యాలు ఉన్న ఫోన్లు ఇవి.

వన్‌ప్లస్‌ 10 ప్రొ: ఇది ఇంకా సరసమైన ధరకు అంటే రూ.61,999 నుంచి 66,999 మధ్య ఉండడంతో పాటు ర్యామ్‌, స్టోరేజీ అనుసరించి లభిస్తోంది. రేర్‌ కెమెరా వ్యవస్థకు తోడు కేవలం అర్ధ గంటలో చార్జింగ్‌ ఫుల్‌ అవుతుంది.

శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 4: ఫోల్డబుల్‌ ఫోన్లలో లేటెస్ట్‌గా దీన్ని చెప్పవచ్చు. ఇండియా వరకు దీనికి మార్కెట్‌లో పోటీదారు లేరు. ఐపీఎక్స్‌8 వాటర్‌ రెసిస్టెంట్‌. సాలిడ్‌ కెమెరా సిస్టమ్‌ ఉంది. మూడు స్టోరేజీ వేరియంట్స్‌ ఉన్నాయి. రేటు రూ.154,999, రూ.1,64,999, రూ.1.84.999 కి అవి లభిస్తున్నాయి.

ఐఫోన్‌ 14 ప్రొ: మొబైల్‌ టెక్నాలజీ, డిజైన్‌పరంగా లేటెస్ట్‌ ఆఫరింగ్స్‌తో వచ్చింది. టాప్‌ 5 అలా్ట్ర ప్రీమియం ఫోన్ల జాబితాలో ఇది కూడా ఉంది. సిలికాన్‌ మార్కెట్‌ ముందువరుసలో ఉన్న ఎ16 బయోకాన్‌ చిప్‌ దీనికి ఉంది. ఫలితంగా కెమెరా సిస్టమ్‌ అద్వితీయంగా ఉంది. ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్‌ సపోర్ట్‌కు పూచీ పడుతోంది. నాలుగు వేరియంట్స్‌ వేర్వేరు రేట్లు రూ.1,29,900 నుంచి రూ.1,79.900 వరకు ఉన్నాయి.

Updated Date - 2022-12-31T04:12:19+05:30 IST

Read more