Planning for a pet : మీ బిడ్డకు పెంపుడు జంతువుతో బంధాన్ని పెంచాలంటే ఇలా చేయండి.

ABN , First Publish Date - 2022-11-15T13:58:33+05:30 IST

పెంపుడు జంతువులతో ఆడుకోవడం వాటితో సమయాన్ని గడపడం అనేది చాలా సంతోషకరమైన విషయం.

Planning for a pet : మీ బిడ్డకు పెంపుడు జంతువుతో బంధాన్ని పెంచాలంటే ఇలా చేయండి.
Planning for a pet

పెంపుడు జంతువుని కుటుంబంలోకి తీసుకురావడం అంటే అది ఎంతో సంతోషకరమైన విషయం. కుక్కలు, పిల్లుల్ని పెంచుకోవాలని నిర్ణయం తీసుకోవడం అనేది మన రోజువారి ఒత్తిడిని తీసేసేందుకు చక్కని పరిష్కారం కూడా అవుతుంది. ఎందుకంటే పెంపుడు జంతువులతో ఆడుకోవడం వాటితో సమయాన్ని గడపడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇక పిల్లల విషయానికి వస్తే పెంపుడు జంతువుతో ఆడుకోవడం, మాట్లాడటం వాళ్ళకు ఇతరుల పట్ల సానుభూతితో వ్యవహరించే గుణాన్ని ఇస్తుంది. ఎదుటివారి పట్ల బాధ్యత, శ్రద్ధ వహించేలా మారుస్తుంది.

పెంపుడు జంతువుతో పెరగడం అనేది పిల్లల అభివృద్ధిలో ముఖ్యమైన అంశం. మీ బిడ్డ పెంపుడు జంతువుతో బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఈ సూచనలను ఫాలోకండి.

ఇలా మెలిగేలా చేయండి.

పెంపుడు జంతువును కుటుంబ సభ్యునిగా పరిగణించాలి. పిల్లలు వారి జీవితంలో ముఖ్యమైన విషయాలను పెద్దల నుంచే నేర్చుకుంటారు. పెంపుడు జంతువును ఇంట్లో కుటుంబ సభ్యునిగా చూడడం మొదలు పెడితే పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు.

ప్రయోగాత్మక విధానం..

పెంపుడు జంతువు అవసరాలను గురించి పిల్లలతో మాట్లాడుతూ ఉండండి. వాటితో సమయాన్ని గడపమని, మాట్లాడమని పిల్లలతో చెపుతూ ఉండండి. అలాగే పిల్లల పడకగది దగ్గరలో మీ కుక్కకో, పిల్లికో చిన్న పక్కను కూడా ఏర్పాటు చేయండి. దీనితో పెంపుడు జంతువు కూడా తనతో సమానమని, కుటుంబంలో భాగమనే భావన పిల్లల్లో కలుగుతుంది.

జాగ్రత్తలు అవసరం...

చాలా చిన్న పిల్లలు పెంపుడు జంతువులతో ఆడుకునేప్పుడు గాయాలు కాకుండా భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పెంపుడు జంతువుతో మృదువుగా ఉండటాన్ని పిల్లలకు నేర్పాలి. కుక్కపిల్ల, పిల్లి, కుందేలు ఇవన్నీ తనలాగే నొప్పి, భయం, దుఃఖం, సంతోషాన్ని అనుభవిస్తాయనేది పిల్లలకు తెలియజెప్పాలి.

జంతువుల గురించి చాలా విషయాలు పిల్లలతో మాట్లాడుతూ వాటి గురించి పరిచయం చేస్తూ ఉండాలి. పెంపుడు జంతువులను తాకే విధానం కూడా సరిగా తెలియాలి. చాలా జంతువులు ముఖ్యంగా కుక్క, పిల్లి వంటివి వాటి తోకలను తాకడాన్ని ఇష్టపడవు. కానీ గడ్డం కింద చక్కిలిగింతలు పెట్టడం ఇష్టపడతాయి. పెంపుడు జంతువు భావాలను గౌరవించడం, జంతువును బాధపెట్టేది ఏదీ చేయకుండా జాగ్రత్త పడటం నేర్పించాలి.

ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది. మీ బిడ్డను బాధపెట్టకుండా పెంపుడు జంతువు విషయంలో శిక్షణ పొందేలా వాటితో సాన్నిహిత్యం కలుగుతుంది. అలాగే కోపంలో దాని కాటు పడకుండా కూడా పిల్లలు మచ్చికచేసుకునే విధంగానూ ఉంటుంది.

Updated Date - 2022-11-15T14:00:11+05:30 IST