ఇంటి అలంకరణ ఇలా!

ABN , First Publish Date - 2022-03-05T05:30:00+05:30 IST

ఇంటిని భూతల స్వర్గంగా అలంకరించుకోవాలని ఉంటుంది. అయితే

ఇంటి అలంకరణ ఇలా!

ఇంటిని భూతల స్వర్గంగా అలంకరించుకోవాలని ఉంటుంది. అయితే ఇందుకోసం మీరేం పెద్ద డిజైనర్‌ కానవసరం లేదు.. చిన్నపాటి చిట్కాలతో మీ ఇంటిని శోభాయమానంగా తీర్చిదిద్దుకోవచ్చు.


 ఇంట్లో గోడలకు మంచి పెయింటింగ్‌ వేస్తే.. ఆ ఫీలింగ్‌ ఐదేళ్లపాటు కొత్తగా కంటిన్యూ అవుతుంది. గోడకు వేసిన రంగు ఆధారంగా మన మూడ్‌ ఉంటుందని మరిచిపోవద్దు. అందుకే కళ్లకు ఆహ్లాదకరంగా ఉండే రంగుల్నే ఎంచుకోవాలి. ఇకపోతే కాస్త క్రియేటివ్‌గా ఆలోచించేవారైతే గోడమీద బొమ్మలు వేయించవచ్చు. త్రీడీ ఎఫెక్ట్‌ లాంటి బొమ్మలు వేయిస్తే ఆ అందమే వేరుగా ఉంటుంది. 


 ప్రతి ఇంటిలో స్పేస్‌ ముఖ్యం. అది కూడా కంఫర్ట్‌గా సెట్‌ చేసుకోవాలి. మార్కెట్లో దొరికే వస్తువులన్నీ ఇంట్లో ఉంచటం వల్ల ఇబ్బందే. ప్రతి ఇంట్లో సోఫా, కుర్చీలు, బెడ్‌.. ఉండే  ప్రాంతాల్లో దగ్గర దగ్గరగా వేరే వస్తువులను పెట్టకూడదు గ్యాప్‌ ఉండాలి. అప్పుడే కళ్లకు క్లియర్‌గా ఉంటుంది. పాజిటివ్‌ మూడ్‌ క్రియేట్‌ అవుతుంది.


 ఫర్నిచర్స్‌ ఇతర వస్తువులు ఒకే చోట ఉంచుకోవాలనే నిబంధన పెట్టుకోవద్దు. అప్పుడప్పుడూ స్థలం మార్చుతూ ఉంటే.. మనం ఉండే ఇల్లేనా? అనే భావన కలుగుతుంది. మనకే కొత్తగా అనిపిస్తుంది.  


 సంవత్సరాల పాటు ఉండే డోర్‌ కర్టెన్స్‌, కిటికీ కర్టెన్స్‌ను మార్చటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. కొత్త అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా గోడ రంగును బట్టి కర్టెన్స్‌ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లో మోడ్రన్‌గా ఉండే వివిధ రకాల్లో ఉండే కర్టెన్స్‌ లభ్యమవుతున్నాయి. వాటిని ఎంపిక చేసుకోవటం మంచిది.


 కుషన్స్‌కు కవర్స్‌ వేసి సరికొత్త అందాన్ని తీసుకురావచ్చు. ఎంబ్రాయిడరీ, ప్రింటెడ్‌, మోడ్రన్‌ లుక్‌లో ఉండే కుషన్స్‌ను కొనుక్కోవాలి. ముఖ్యంగా ప్రింటెడ్‌ కుషన్స్‌ బావుంటాయి.


 ఇల్లు ఎంత చక్కగా ఉన్నా.. సరైన ప్లేస్‌లో మంచి లైట్స్‌ను ఏర్పాటు చేయకపోతే బావుండదు. మంచి లైటింగ్‌ ఇంటికి సరికొత్త వన్నె తెస్తుంది.


 గోడ ఉందని ఇష్టమొచ్చినట్లు ఫొటో ఫ్రేమ్‌లు అలంకరిచొద్దు. క్రియేటివ్‌గా ఉండే ఒకట్రెండు ఫొటో ఫ్రేమ్స్‌నే తగిలించాలి. 


 గార్డెన్‌ లేకపోతే ఇంటి ముందు పూలమొక్కలు పెంచుకోవచ్చు. సెంటర్‌ టేబుల్స్‌ మీద పూలకుండీ పెడితే ఆ అందమే వేరు. ఇంట్లో, ఇంటిచుట్టూ మొక్కలుంటే.. ఆ పచ్చదనం ఆహ్లాదాన్ని పంచుతుంది.  


Updated Date - 2022-03-05T05:30:00+05:30 IST