Kaftan Kurti: కులాసాగా... కఫ్తాన్‌ కుర్తీ

ABN , First Publish Date - 2022-11-22T22:13:53+05:30 IST

కఫ్తాన్‌ స్టైల్‌ నైటీలే కాదు కుర్తీలు కూడా అంతే మోడర్న్‌గా ఉంటాయి. జీన్స్‌ మొదలు, పలాజో వరకూ అన్ని రకాల బాటమ్స్‌తో మ్యాచ్‌ చేసే వీలున్న కఫ్తాన్‌ స్టైల్‌ కుర్తీలు ఇవే!

Kaftan Kurti: కులాసాగా...  కఫ్తాన్‌ కుర్తీ

ఫ్యాషన్‌

కఫ్తాన్‌ స్టైల్‌ నైటీలే కాదు కుర్తీలు కూడా అంతే మోడర్న్‌గా ఉంటాయి. జీన్స్‌ మొదలు, పలాజో వరకూ అన్ని రకాల బాటమ్స్‌తో మ్యాచ్‌ చేసే వీలున్న కఫ్తాన్‌ స్టైల్‌ కుర్తీలు ఇవే!

డిజైన్‌:

బాందినీ, జామెంట్రీ, ఫ్లవర్‌.. ఇలా డిజైన్‌తో పని లేకుండా అన్ని రకాల వస్త్రాల కఫ్తాన్లు చూడముచ్చటగా ఉంటాయి. అయితే సందర్భానికి తగిన డిజైన్‌ను ఎంచుకుంటూ ఉండాలి. అలాగే మోకాళ్ల వరకూ ఉండే లాంగ్‌ కఫ్తాన్లు, లేదా మోకాలి పైవరకూ ఉండే షార్ట్‌ కఫ్తాన్లు... ఈ రెండింట్లో నప్పే వాటినే ఎంచుకోవాలి.

బాటమ్స్‌:

పలాజోలు కఫ్తాన్లకు చక్కగా మ్యాచ్‌ అవుతాయి. అయితే షార్ట్‌ కఫ్తాన్‌తో జీన్స్‌ మ్యాచ్‌ చేయవచ్చు. అయితే ఎలాంటి బాటమ్‌ ఎంచుకున్నా ప్లెయిన్‌గా ఉండేలా చూసుకోవాలి.

యాక్సెసరీస్‌:

హై హీల్స్‌, లేదా బ్యాలరీనాస్‌ కఫ్తాన్‌ కుర్తీలకు చక్కగా నప్పుతాయి. అలాగే కఫ్తాన్లు చేతులను కప్పి ఉంచుతాయి కాబట్టి హెవీగా ఉండే జ్యువెలరీలకు బదులుగా, సింపుల్‌ జ్యువెలరీ ఎంచుకోవాలి. మెడలో, చేతులకు ఆభరణాలను ధరించకుండా ఉంటేనే బాగుంటుంది. చెవులకు జూకాలు పెట్టుకోవచ్చు.

Updated Date - 2022-11-22T22:27:10+05:30 IST