నటుడిగా జేడీ లక్ష్మీనారాయణ

ABN , First Publish Date - 2022-10-02T07:01:29+05:30 IST

జేడీ లక్ష్మీనారాయణ... రాజకీయ వర్గాలకు సుపరిచితమైన పేరు.

నటుడిగా జేడీ లక్ష్మీనారాయణ

జేడీ లక్ష్మీనారాయణ... రాజకీయ వర్గాలకు సుపరిచితమైన పేరు. సీబీఐ అధికారిగా పని చేసి, కొన్ని కీలకమైన కేసుల్లో సంచలనం సృష్టించారు. ఆయన ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చారు. నటుడగా. ‘భీమదేవరపల్లి బ్రాంచి’ చిత్రంలో జేడీ ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. రమేష్‌ చెప్పాల దర్శకత్వం వహించిన చిత్రమిది. పద్మ, సాయి ప్రసన్న, మానుకోట ప్రసాద్‌ తదితరులు నటించారు. బత్తిని కీర్తిలత గౌడ్‌, రాజా నరేందర్‌ చెట్ల పెల్లి నిర్మాతలు. ఇదే చిత్రంలో రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ సైతం తెరంగేట్రం చేయడం విశేషం. ‘‘ఇటీవల జరిగిన ఓ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాని ఆధారంగా ఈ కథని రూపొందించాం. నాటక రంగంలో పేరొందిన నటీనటులకు సినిమాల్లో అవకాశం ఇచ్చాం. రెండు కీలకమైన పాత్రలకు జేడీ, నాగేశ్వరరావులను సంప్రదిస్తే.. కథ నచ్చి సినిమాలో నటించడానికి ఒప్పుకొన్నార’’ని దర్శకుడు తెలిపారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తారు. 

Read more