Big Dogs: Pet bull: వాటిని అర్థం చేసుకోపోతే అదరగణ్ణమే...

ABN , First Publish Date - 2022-07-14T20:32:22+05:30 IST

పిట్ బుల్(Pet bull) రకం కుక్కలు సాధారణంగా లోతైన ఛాతీ, పెద్ద తలలతో బలిష్టమైన కండరాల నిర్మాణం కలిగి ఉంటాయి.

Big Dogs: Pet bull: వాటిని అర్థం చేసుకోపోతే అదరగణ్ణమే...

పెంపుడు కుక్క ప్రేమతో నాకి ఉక్కిరిబిక్కిరి చేస్తుందని మాత్రమే అనుకోవద్దు. దాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే ఎంత మాలిమి అయినా రక్కి దాడికి తెగబడుతుంది తస్మాత్ జాగ్రత్త! కుక్కలు మానవులకు అతి విశ్వాసమైన జంతువు అయినప్పటికీ అవి దూకుడుగా మారడం మనుషుల్ని గాయపరచడం అనేవి ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా చిన్నపిల్లలను ఇవి ఎక్కువగా గాయపరుస్తూ ఉంటాయి. మనం ఎంత ప్రేమగా చూస్తున్నా ఏదో సందర్భంలో హాని కలిగించిన సంఘటనలు ఎదురవుతూనే ఉన్నాయి. 


ఇటీవల లక్నోకు చెందిన 82 ఏళ్ల వృద్ధురాలిని ఆమె పెంపుడు కుక్క పిట్‌బుల్ (Pet bull) గాయపరిచింది. సుశీలా త్రిపాఠి అనే రిటైర్డ్ స్కూల్ టీచర్ ను కైసర్‌బాగ్ ప్రాంతంలో తన ఇంట్లోనే  పిట్‌బుల్(Pet bull) ఆమెపై దాడి చేసింది. గాయపడిన ఆమెను ఆసుపత్రిలో చేర్పించాకా చనిపోయింది. అయితే సరైన శిక్షణ లేకుండా ఇళ్ళల్లో పెద్ద శునకాలను పెంచడం కాస్త ప్రమాదమనే అంటున్నారు పశువైద్యులు. 


మనుషులకు మచ్చికైన శునకాలు.. 

మనం పెంచే పెంపుడు జంతువులలో అతి విశ్వాసమైన జంతువు కుక్క. మనలో చాలా మంది వీటిని పెంచుతున్నారు. వీటిలో పలు రకాలు రకానికో లక్షణాన్ని కలిగి ఉంటాయి. అన్ని జాతుల కుక్కలూ ఒకే విధంగా ప్రవర్తించవు. వీటిని సాకే తీరు కూడా చాలా భిన్నంగా ఉంటుంది. కొందరు వీధికుక్కలను సాకితే.. ఇంకొందరు రకరకాల బ్రీడ్స్(Breeds) ను తెచ్చుకుని ఇళ్ళల్లో పెంచుతుంటారు. 


సుమారు 1400 సంవత్సరాలు కిందటే కుక్కలు మనుషులతో కలిసి జీవించాయని చరిత్ర చెపుతుంది. రాజుల కాలంలో ముఖ్యంగా వేట కోసం వీటిని పెంచేవారు.  మామూలు ప్రజలు పశులకు, ఇళ్ళకు కాపలాగా, పొలాల్లో ఎలుకలు పట్టడానికి పెంచేవారు. మనకు హానిచేసే జీవాల నించి రక్షించడానికి, బడ్లను లాగడానికి, ఒక్కోసారి తప్పుచేసిన వారిని శిక్షించడానికి కూడా కుక్కలనే వినియోగించేవారు. అంతగా మానవునితో పెనవేసుకున్న జీవి శునకం. వీటిలో పెద్ద జాతి కుక్కల తీరు వేరు. అమెరికన్ పిట్ బుల్ టెర్రియర్ ను ఎద్దుల కాపలాకు, కుక్కల పోరాటాల కోసం పెంచేవారు., ఈ జాతి మొత్తం వ్యవసాయ కుక్కలుగా పరిణామం చెందింది. 


జాతి లక్షణాలు..

పిట్ బుల్(Pet bull) రకం కుక్కలు సాధారణంగా లోతైన ఛాతీ, పెద్ద తలలతో బలిష్టమైన కండరాల నిర్మాణం కలిగి ఉంటాయి. ఇవి స్వచ్ఛమైన జాతి కుక్కలు అయినప్పటికీ, మొండితనం, ఆటతీరు, ధైర్యం, బరువు పెరగడం, చురుకుదనం వంటి లక్షణాలు కలిగి ఉంటాయి. ఇతర జాతుల కుక్కలతో పోరాటంలో, పిట్ బుల్స్, జర్మన్ షెపర్డ్స్, గ్రేట్ డేన్స్, రోట్‌వీలర్స్ తరచుగా దూకుడుగా ఉంటాయి. ముఖ్యంగా పిట్ బుల్స్(Pet bull) శునకాలను చిన్న వయస్సు నుండి శిక్షణ అవసరం. లేకపోతే వాటిని సాకడం కష్టం అంటున్నారు డాక్టర్స్. 


పిట్‌బుల్స్ క్రూరమైన/దూకుడు కుక్కలా?

పిట్ బుల్ శునకాలు ఒకే జాతి కాదు వీటిలో ఐదు రకాల పిట్ బుల్స్ ఉన్నాయి. అమెరికన్ బుల్లి (American Bully), అమెరికన్ పిట్ బుల్ టెర్రియర్ (American Pit Bull Terrier), అమెరికన్ స్టాఫోర్డ్‌షైర్ టెర్రియర్ (American Staffordshire Terrier), స్టాఫోర్డ్‌షైర్ బుల్ టెర్రియర్(Staffordshire Bull Terrier), అమెరికన్ బుల్డాగ్(American Bulldog) ఈ రకాలన్నీ ఇంట్లో పెంపుడు జంతువులుగా పెంచుకోవాలంటే తగిన శిక్షణను తీసుకుని ఉండాలి. మనం ఏ శునకాన్నిపెంచినా అది మనం సాకే విధానాన్ని పట్టి ప్రవర్తిస్తుందని వైద్యులు అంటున్నారు. అన్ని జాతి కుక్కల్లానే పిట్ బుల్ కూడా సరైన శిక్షణ ఇచ్చినదైతే కొరికి దాడిచేసే అవకాశం తక్కువగా ఉంటడేది. మామూలుగా కొన్ని జాతి కుక్కలు మరీ దూకుడుగా ఉంటాయి. దానికి మనం వాటిని చూసే దృష్టి మీద ఆధారపడి ఉంటుంది. వాటిని పెంచేప్పుడు ప్రేమగా, కాస్త ప్రత్యేకమైన శ్రద్ధ గల జంతువులుగా చూడాలి. అలా చూడనప్పుడు కృరంగా తయారవుతాయి.


ఈ శద్ధ అవసరమే..

పదే పదే వాటిని కొట్టడం, బంధించడం, ఒంటరిగా ఉంచడం, సరైన, సరిపడా ఆహారాన్ని అందివ్వకపోవడం కూడా వాటి ప్రవర్తనను మారుస్తాయి. కృరంగా మారేలా చేస్తాయి. ఈ జాతి కుక్కలు ఇక్కడి ప్రజలకు తగినవి కావు. ముఖ్యంగా భారీ ఆకారం, శక్తి అధికంగా ఉండే జాతి కుక్కలను మనం పెంచడం కష్టంతో కూడుకున్న పనే. అలానే ఇవి పెంపుడు జంతువులుగా ఉండాలంటే మంచి శిక్షణ అవసరం. ఇందులో కొన్ని జాతులకు ఎక్కువ వ్యాయామం, శ్రద్ధ అవసరం. వాటి ఆహారం, చికిత్స విషయాలను ఎప్పుడూ పట్టించుకుంటూ ఉండాలి. అంతే కాకుండా కుక్కల స్వభావం, వాటి జాతికి సంబంధించి సరైన రికార్డు లేనప్పుడు వాటిని ఇళ్ళల్లోకి తెచ్చుకోవడం సరికాదు.




Updated Date - 2022-07-14T20:32:22+05:30 IST