వారం రోజుల్లో ఇంటికి నూతన అందం

ABN , First Publish Date - 2022-05-01T00:57:02+05:30 IST

వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ ఇంటిని నవ్య నూతనంగా డిజైన్ చేసుకునేందుకు

వారం రోజుల్లో ఇంటికి నూతన అందం

వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ ఇంటిని నవ్య నూతనంగా డిజైన్ చేసుకునేందుకు ఇదే అత్యుత్తమ సమయం. రెండేళ్ల విలువైన కాలం కరోనాతోనే గడిచిపోయిన వేళ ఇంటిని మరింత ఆహ్లాదకరంగా మార్చడంతో మనకు అనుకూలంగా, అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. హోం రెనోవేషన్ ప్రాజెక్టులకు వేసవిని అత్యుత్తమ సమయంగా భావిస్తారు. డిజైనర్ సీలింగ్స్ పరంగా వివిధ రకాల ఆకృతులు కనిపిస్తున్నాయి. హాల్, బెడ్రూము సీలింగ్ దగ్గరకు వచ్చేసరికి ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. సీలింగ్‌ను వివిధ రకాల మెటీరియల్స్‌తో తయారుచేస్తున్నారు. అయితే వీటిలో జిప్సం అత్యంత ప్రాచుర్యం పొందింది. అతి తక్కువ నిర్వహణతోపాటూ ధూళిని దరిచేరనివ్వదు కాబట్టే దీనికి అందరూ ప్రాధాన్యం ఇస్తున్నారు. 


సీలింగ్

ఇంటిలో ఎక్కువగా నిర్లక్ష్యానికి గురయ్యే వాటిలో సీలింగ్ ఒకటి. ఇంటీరియర్‌ను అలంకరించాలనుకునేవారు సాధారణంగా గది గోడలు, ఫ్లోర్ మీద శ్రద్ధ పెడతారు. నిజానికి ఇంటి అందాన్ని ఇనుమడింపజేసేది సీలింగే. ఇంటికి మరింత అందం రావాలంటే సీలింగును కూడా పట్టించుకోవాలి.  ప్రస్తుతం, బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు చివరికి ఆర్కిటెక్ట్‌లు కూడా డిజైన్ ప్రక్రియ ప్రారంభం నుంచి డిజైన్డ్ ఫాల్స్ సీలింగ్ వినియోగాన్ని నొక్కి చెబుతున్నారు. 


సీలింగ్ ఓ మిత్రుడు

ఓ ఇంటి యజమానిగా ఇంటీరియర్స్‌కు తిరిగి రూపకల్పన చేయడం ఖర్చుతో కూడుకున్న విషయంగా చాలామంది భావిస్తారు. అయితే, ఇందుకోసం బ్యాంకులో దాచుకున్న మొత్తాన్ని ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. అయితే, ఇందుకు నమ్మకమైన భాగస్వామి అవసరం. ఆ భాగస్వామి సెయింట్ గొబైన్ జిప్రోక్ అయితే నిర్ణీత గడువులో, అనుకున్న బడ్జెట్‌లో సీలింగ్‌ను తీర్చిదిద్దుకోవచ్చు. ఇందుకు సంబంధించి సమగ్రమైన క్యాటలాగ్స్‌ను అభివృద్ధి చేసింది. కేవలం ఏడు రోజుల్లో సీలింగ్‌కు ఇవి నూతన అందాన్ని ఇవ్వనున్నాయి. జిప్సం సీలింగ్ ఖర్చు నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి, డిజైన్‌ అవకాశాలు, ఇన్‌స్టాలేషన్‌ ఖర్చు, రవాణా, కూలి ఖర్చులు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే చదరపు అడుగుకు రూ. 100-140 మధ్య ఉంటుంది. అయితే, ఇది కూడా డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. అంతేకాదు, లివింగ్ స్పేస్‌కు సంబంధించి అత్యుత్తమ డిజైన్‌ను ఎంచుకునేందుకు కూడా జప్రోక్ సాయం చేస్తుంది. అవసరమైన మార్గనిర్దేశకత్్వం చేస్తుంది. కాబట్టి సీలింగ్స్ విషయంలో ఇది అత్యంత నమ్మకమైన మిత్రుడిగా నిలుస్తుంది. 


వేసవిలో విద్యుత్ బిల్లులు తగ్గించేలా..

జిప్సం బోర్డులను వినియోగించి సీలింగ్ డిజైన్ చేయడం వల్ల విభిన్న ఆకృతులను ఎంచుకోవచ్చు. ఆకర్షణీయమైన ఫినిషింగ్ వల్ల ప్రాపర్టీ అందం మరింత ఇనుమడిస్తుంది. అంతేకాదు, ఎయిర్ కండిషనింగ్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా వేసవిలో విద్యుత్ బిల్లులను సైతం ఇవి తగ్గిస్తాయి. వాస్తవ సీలింగ్‌కు ఫాల్స్ సీలింగ్ ఒక అడుగు కిందకు ఉంటుంది కాబట్టి ఏసీ వినియోగం తగ్గుతుంది. ఫలితంగా విద్యుత్ ఆదా అవుతుంది. వాల్ డెకార్, ఫాల్స్ సీలింగ్ కోసం జిప్రోక్ విస్తృత శ్రేణిలో అవకాశాలను అందిస్తుంది. ఇది అత్యంత తేలికగా ఉండడంతోపాటు మన్నికైన మెటీరియల్‌ను వాడతారు కాబట్టి కనీసం రెండు దశాబ్దాలపాటు సాధారణ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి జిప్రోక్‌తో నూతన జీవన శైలికి మార్గం వేసుకోవచ్చు. 

Updated Date - 2022-05-01T00:57:02+05:30 IST