ఈసారైనా హిట్టు కొట్టాలి!

ABN , First Publish Date - 2022-09-25T06:56:13+05:30 IST

టాలీవుడ్‌లో ప్రతిభ కంటే, హిట్టూ, ఫ్లాపులే ఎక్కువ ప్రభావం చూపిస్తుంటాయి. ఓ దర్శకుడి చేతిలో హిట్లుంటే..

ఈసారైనా హిట్టు కొట్టాలి!

టాలీవుడ్‌లో ప్రతిభ కంటే, హిట్టూ, ఫ్లాపులే ఎక్కువ ప్రభావం చూపిస్తుంటాయి. ఓ దర్శకుడి చేతిలో హిట్లుంటే.. వాళ్లనే పిలిచి అవకాశాలు ఇస్తుంటారు హీరోలు. కానీ నాని ఆ టైపు కాదు. ఆయన ప్రతిభకే పెద్ద పీట వేస్తారు. ఈసారీ అదే జరిగింది. ఓ ఫ్లాప్‌ దర్శకుడ్ని పిలిచి మరీ ఆయన అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయనే మేర్లపాక గాంధీ. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ చిత్రాలతో అలరించిన దర్శకుడు మేర్లపాక గాంధీ. ఆ తరవాత నానితో ‘కృష్ణార్జున యుద్ధం’ రూపొందించారు. కానీ ఆ సినిమా ఫ్లాప్‌ అయ్యింది. అయినా సరే.. ఇప్పుడు మళ్లీ మేర్లపాకకు మరో ఛాన్స్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. మేర్లపాకతో ఓ సినిమా చేయడానికి నాని రెడీ అయ్యారన్నది టాక్‌. వీరిద్దరి మధ్యా ఇటీవల కథా చర్చలు జరిగాయట. ప్రస్తుతం ‘లైక్‌ షేర్‌ సబ్‌ స్ర్కైబ్‌’ అనే చిత్రాన్ని రూపొందించారు మేర్లపాక. ఆ తరవాత నాని సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలెడతారని సమాచారం. నాని ‘దసరా’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తరవాత ఈ ప్రాజెక్టు మొదలవ్వొచ్చు. 

Read more