గూగుల్ మ్యాప్స్‌తో ఇంధనం ఆదా!
ABN , First Publish Date - 2022-09-10T05:30:00+05:30 IST
గూగుల్ మ్యాప్స్ మరో కొత్త అడుగు వేసింది. మోస్ట్ ఫ్యూయల్ ఎఫిసియెంట్ రూట్ అంటే ఏ మార్గంలో వెళితే ఇంధనం ఆదా అవుతుందన్నది
గూగుల్ మ్యాప్స్ మరో కొత్త అడుగు వేసింది. మోస్ట్ ఫ్యూయల్ ఎఫిసియెంట్ రూట్ అంటే ఏ మార్గంలో వెళితే ఇంధనం ఆదా అవుతుందన్నది తెలియజేస్తుంది. ప్రస్తుతం అమెరికా, కెనడా, జర్మనీలో అమలవుతోందని చెబుతున్న ఈ ఫీచర్‌ని యూరప్‌లో 40 దేశాలకు విస్తరించే యోచనలో ఉందని ‘9టు5 గూగుల్’ వెల్లడించింది.
దీన్ని ఉపయోగించే వ్యక్తులు తాము ఏ రకం ఇంధనం ఉపయోగిస్తున్నారన్న విషయాన్ని తెలియజేయాలి. ఎకో-ఫ్రెండ్లీ ఫీచర్‌గా దీనిని పేర్కొంటున్నారు. డబ్బు ఆదాతోపాటు కర్బన ఉద్ఘారాల నియంత్రణ ఈ ఫీచర్ లక్ష్యం. ‘మోస్ట్ ఫ్యూయల్-ఎఫిసియెంట్ రూట్’ అన్న బ్యాడ్జ్ ప్రత్యేకించి ఆ రూట్‌పై కనిపిస్తుంది. అవసరం లేదనుకుంటే ఈ ఫీచర్‌ను డిజేబుల్ చేసుకునే వెసులుబాటు కూడా ఇందులో ఉంది.