అప్రికాట్స్‌ తింటున్నారా?

ABN , First Publish Date - 2022-04-05T05:30:00+05:30 IST

కుబానీ కా మీఠాగా స్వీట్‌ రూపంలో మనం తినే అప్రికాట్లలో ఆరోగ్యానికి తోడ్పడే ఎన్నో పోషకాలుంటాయి.

అప్రికాట్స్‌ తింటున్నారా?

కుబానీ కా మీఠాగా స్వీట్‌ రూపంలో మనం తినే అప్రికాట్లలో ఆరోగ్యానికి తోడ్పడే ఎన్నో పోషకాలుంటాయి. అవేంటంటే...

వీటిలో అత్యధిక పరిమాణాల్లో ఉండే బీటా కెరొటిన్‌తో కళ్లకు రక్తప్రసరణ పెరుగుతుంది. కండరాల క్షీణత తగ్గుతుంది.

వీటిలో ఉండే పీచు వల్ల రక్తనాళాల్లో పేరుకున్న కొలెస్ట్రాల్‌ కరుగుతుంది. ఫలితంగా గుండె మీద భారం తగ్గుతుంది.

అరకప్పు అప్రికాట్లతో ఒక రోజుకు శరీరానికి అవసరమైన పొటాషియంలో పది శాతం సమకూరుతుంది.

వీటిలోని విటమిన్లు, ఖనిజ లవణాలు చర్మం మెరవడానికి తోడ్పడతాయి.

మలబద్ధకం వదలడం, పెద్ద పేగుల ఆరోగ్యం మెరుగవడం వీటిలో ఉండే పీచుతో ఒరిగే మరో ప్రయోజనం.

వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల గౌట్‌, ఆర్థ్రయిటి్‌సల నుంచి ఉపశమనం దక్కుతుంది.

వీటిలోని రాగితో ఇనుము శోషణ పెరుగుతుంది.

Read more