వచ్చే ఏడాది యాపిల్ ఎంఆర్ హెడ్సెట్
ABN , First Publish Date - 2022-06-18T09:43:05+05:30 IST
యాపిల్ - మిక్స్డ్ రియాలిటీ(ఎంఆర్) హెడ్‌సెట్‌పై పనిచేస్తోంది. ఆగ్మెంటెడ్ రియాలిటీ(ఏఆర్), వర్చ్యువల్ రియాలిటీ(వీఆర్)ని కలిపి మిక్స్డ్ రియాలిటీకి వీలుకల్పిస్తోందని సమాచారం.
యాపిల్ - మిక్స్డ్ రియాలిటీ(ఎంఆర్) హెడ్‌సెట్‌పై పనిచేస్తోంది. ఆగ్మెంటెడ్ రియాలిటీ(ఏఆర్), వర్చ్యువల్ రియాలిటీ(వీఆర్)ని కలిపి మిక్స్డ్ రియాలిటీకి వీలుకల్పిస్తోందని సమాచారం. ఈ హెడ్‌సెట్‌ను వచ్చే ఏడాది రెండో అర్ధభాగంలో విడుదల చేస్తుందని అనలిస్టులు చెబుతున్నారు. ఈ ఏడాది మూడో క్వార్టర్లో టెస్టింగ్‌ను మొదలుపెడుతుందని కూడా అంటున్నారు. యాపిల్ ఏఆర్ గ్లాసెస్‌కు సంబంధించి ఎన్ని పుకార్లు షికారు చేసినప్పటికి డిజైన్ పరిమితుల దృష్ట్యా ఐఫోన్పైనే ఈ గ్లాసెస్ డిపెండ్ అయి ఉంటాయి.