2023 వెల్కమ్ మేకప్
ABN , First Publish Date - 2022-12-31T03:48:01+05:30 IST
2022కు గుడ్ బై చెప్పేసి, కిల్లర్ కళ్లతో 2023కి స్వాగతం పలకాలంటే, సరికొత్త ఐమేకప్ టెక్నిక్స్‌ను అనుసరించాలి.
2022కు గుడ్ బై చెప్పేసి, కిల్లర్ కళ్లతో 2023కి స్వాగతం పలకాలంటే, సరికొత్త ఐమేకప్ టెక్నిక్స్‌ను అనుసరించాలి. అందుకోసం ఇవిగో ఈ టిప్స్ ఫాలో అయిపోండి.
క్రిస్టల్ ఐస్: క్రిస్టల్ రైన్స్టోన్స్కు మేక్‌పలో స్థానం కల్పించడం లేటెస్ట్ ఫ్యాషన్. ఇందుకోసం కనురెప్పలకు షాంపేన్ బేస్డ్ ఐ షాడో అప్లై చేసుకుని, క్రిస్టల్ రైన్స్టోన్స్ను అక్కడక్కడా అద్దుకోవాలి. ఇలా చేస్తే మీ ముఖం వజ్రంలా మెరిసిపోవడం ఖాయం.
గ్లేజ్డ్ గ్లామర్: మెరుపులీనే ముఖం సొంతం కావాలంటే, అలా్ట్ర గ్లాసీ లిప్‌స్టిక్, షిమ్మరీ ఐ షాడో ఎంచుకోవాలి.
ల్యావెండర్ హేజ్: ఐ మేకప్ న్యూఇయర్ పార్టీ అసాంతం చెక్కు చెదరకుండా ఉండాలంటే, కంటి మేక్‌పకు ముందు ఐ ప్రైమర్ అప్లై చేసుకోవాలి.
క్లాసిక్ రెడ్: ముదురు రంగు ఇటుక రంగు లిప్‌స్టిక్ పార్టీ లుక్‌ను తెచ్చి పెడుతుంది. కాబట్టి రెడ్ కార్పెట్ రెడ్ లేదా డార్క్ రెడ్ లిప్‌స్టిక్‌ను పెదవులకు అప్లై చేసుకోవాలి.
గ్లిట్టర్ అండర్లైనర్: కనురెప్పలకే కాదు, కళ్ల దిగువన అలంకరణ కూడా మేక్‌పలో కీలకమే! ఇందుకోసం మెరుపులీనే స్పార్క్లీ కళ్ల దిగువన తగుమాత్రంగా అప్లై చేసుకోవాలి. అలాగే ఫాల్స్ ఐ ల్యాషెస్ అలంకరించుకోవాలి.
క్రిస్టల్ క్యాట్ ఐ: కనురెప్పలకు ఐలైనర్ దిద్దుకుని, దాని మీద వరస నక్షత్రాల్లా క్రిస్టల్స్‌ను అద్దుకోవాలి.