2022 టెక్ రివ్యూ

ABN , First Publish Date - 2022-12-31T04:16:16+05:30 IST

కొవిడ్‌ -19... నాలుగేళ్ళయినా మానవాళిని వదలటం లేదు. ప్రస్తుతం చైనాను కుదిపేస్తున్న కొవిడ్‌ మరికొన్ని దేశాల్లోనూ హల్‌చల్‌ చేస్తోంది.

2022 టెక్ రివ్యూ

కొవిడ్‌లో కాపాడిన హెల్త్‌ గ్యాడ్జెట్స్‌

కొవిడ్‌ -19... నాలుగేళ్ళయినా మానవాళిని వదలటం లేదు. ప్రస్తుతం చైనాను కుదిపేస్తున్న కొవిడ్‌ మరికొన్ని దేశాల్లోనూ హల్‌చల్‌ చేస్తోంది. అప్పట్లో మన దేశంలోనూ చాలా మంది కొవిడ్‌ భయంతో వీటిని ఇంట్లో మెయింటెన్‌ చేశారు. అయితే ఇవేవీ డాక్టర్‌కు ప్రత్యామ్నాయం కావు. కాకపోతే పరిస్థితిని దిగజారక ముందే గుర్తించడానికి ఉపయోగపడతాయి.

పల్స్‌ ఆక్సీ మీటర్‌: రక్తంలో ఆక్సిజన్‌ స్థాయులు తగ్గిపోవడం అన్నది ప్రమాద సూచిక. డెల్టా వేరియంట్‌ సోకినప్పుడు ఇది చాలా మంది ప్రాణాలను కాపాడింది. పల్స్‌ ఆక్సీమీటర్‌తో ఎస్‌పిఒ2 లెవెల్స్‌ను ట్రాక్‌ చేయవచ్చు. తద్వారా వైద్య చికిత్స అవసరాన్ని గుర్తించవచ్చు. రూ500 నుంచి రూ. 2500 లోపు ధరకు పల్స్‌ ఆక్సీమీటర్లు లభిస్తాయి.

డిజిటల్‌ బ్లడ్‌ ప్రెజర్‌ మానిటర్‌: బ్లడ్‌ ప్రెజర్‌ రేంజ్‌ 80-120 ఎంఎం హెచ్‌జి మధ్య ఉండాలి. బ్లడ్‌ ప్రెజర్‌కు తోడు కావాల్సిన వారు పల్స్‌ రేటును కూడా తెలిపే మానిటర్‌ను కొనుగోలు చేయడం మంచిది. కొద్దిగా డీసెంట్‌ మానిటర్‌ కావాలంటే రూ.రెండువేల నుంచి రూ.మూడు వేలకు లభిస్తుంది.

గ్లూకోమీటర్‌: రక్తంలో గ్లూకోజ్‌ లెవెల్స్‌ను దీంతో తెలుసుకోవచ్చు. అయితే అందరికీ దీని అవసరం పడదు. డయాబెటిక్‌ రోగులు దీన్ని ఉపయోగిస్తుంటారు. రూ.500 నుంచి ఇది లభ్యమవుతుంది.

ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌: రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గినప్పుడు, మరింత ప్రమాదం జరగకుండా డాక్టర్ల సహాయం పొందే వరకు ఉపయోగపడింది. మనం పీల్చే గాలిలో నైట్రోజన్‌ సహా ఇంప్యూరిటీస్‌ను వేరే చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. వారెంటీ పీరియడ్‌, కచ్చితత్వం, సర్వీస్‌ నెట్‌ వర్క్‌ వంటి విషయాలను దీన్ని కొనుగోలు చేసే ముందే తెలుసుకోవాలి.

పోర్టబుల్‌ ఆక్సిజన్‌ కానిస్టర్‌: ఊపిరి అందని పరిస్థితుల్లో సరైన వైద్య చికిత్స అందేవరకు ఉపయోగపడే అత్యవసరమైన డివైస్‌ ఇది. నిజానికి ఇదో స్వల్పకాలిక పరిష్కారం. అంతే తప్ప ఇది శాశ్వతం కాదు.

నెబ్యులైజర్‌ మెషీన్‌:

త్వరితగతిన లంగ్స్‌ ద్వారా నేరుగా ఆక్సిజన్‌ పంపేందుకు ఈ మెషీన్‌ ఉపయోగపడుతుంది. లోపల ఉండే నిమ్మును తొలగిస్తుంది. రూ.1500 నుంచి లభ్యమవుతుంది.

స్టీమర్‌: జలుబు, దగ్గు నుంచి ఉపశమనానికి ఉపయోగపడుతుంది. అవిరిని లోపలకు పంపుతుంది. తద్వారా గొంతులో ఇరిటేషన్‌ తగ్గింపునకు తోడు గాలి ఆడని పరిస్థితి నుంచి తప్పిస్తుంది.

సెల్ఫ్‌ క్లీనింగ్‌ మాస్క్‌లు: యాంటీ బయాటిక్‌ కోటింగ్‌తో సెల్ఫ్‌ క్లీనింగ్‌ మాస్కులు ఉన్నాయి. వాటిని ఎక్కువ సార్లు ఉపయోగించుకోవచ్చు. తద్వారా మెడికల్‌ వేస్ట్‌ సైతం తగ్గుతుంది.

రెస్పిరేటరీ ఎక్స్‌ర్‌సైజర్‌: ఆందోళనను తగ్గించడమే కాకుండా మొత్తమ్మీద ఊపితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో లంగ్‌/రెస్పిరేటర్‌ ఎక్స్‌ర్‌సైజర్‌ పనికొస్తుంది. రక్తంలో హార్మోన్ల సర్క్యులేషన్‌ను పెంచుతుంది. దాంతో హార్డ్‌, బ్రెయిన్‌, లంగ్స్‌కు బ్లడ్‌ ఫ్లో పెరుగుతుంది.

డిజిటల్‌ ఐఆర్‌ థెర్మామీటర్‌: ఇదో కాంటాక్ట్‌లెస్‌ డివైస్‌. ఒకటి నుంచి రెండు ఇంచీల దూరం నుంచే బాడీ టెంపరేచర్‌ను దీంతో కనుగొనవచ్చు. కాంటాక్ట్‌లెస్‌ కావడంతో క్రాస్‌ ఇన్ఫెక్షన్లు తగ్గే అవకాశం ఉంది. రూ.900 నుంచి ఈ డివైస్‌ అందుబాటులో ఉంది.

Updated Date - 2022-12-31T05:17:37+05:30 IST

Read more