Shraddha Walkar case: ఆఫ్తాబ్ చాలా తెలివైనవాడు...కేసులో కొత్త ట్విస్ట్ ఉండవచ్చు...దర్యాప్తు చేసిన పోలీసు అధికారి వెల్లడి

ABN , First Publish Date - 2022-12-09T06:33:43+05:30 IST

శ్రద్ధావాకర్ హత్యకేసులో నిందితుడైన ఆఫ్తాబ్ పూనావాలాను శుక్రవారం సాకేత్ కోర్టు ముందు హాజరుపర్చనున్నారు...

Shraddha Walkar case: ఆఫ్తాబ్ చాలా తెలివైనవాడు...కేసులో కొత్త ట్విస్ట్ ఉండవచ్చు...దర్యాప్తు చేసిన పోలీసు అధికారి వెల్లడి
Aaftab Poonawalla

న్యూఢిల్లీ : శ్రద్ధావాకర్ హత్యకేసులో నిందితుడైన ఆఫ్తాబ్ పూనావాలాను శుక్రవారం సాకేత్ కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.(Shraddha Walkar murder case)ఇటీవల నార్కోఅనాల్‌సిస్ పరీక్షకు తీసుకువెళ్లి తీహార్ జైలుకు తిరిగి తీసుకువస్తుండగా ఆఫ్తాబ్ పై(Aaftab) దాడికి కొందరు యత్నించారు.దీంతో ముందు జాగ్రత్తచర్యగా ఆఫ్తాబ్ ను న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నందున అతనికి ప్రత్యేక భద్రత కల్పించాలని జైలు అధికారులు 3వ బెటాలియన్‌ను కోరారు.(Saket Court)

తన జీవిత భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను హత్య చేసిన నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు.జైలులో నిందితుడు ఆఫ్తాబ్ తోటి ఖైదీలతో కలిసి చదరంగం ఆడుతూ, ఇంగ్లీషు నవలలు చదువుతూ గడుపుతున్నాడని తీహార్ జైలు అధికారులు చెప్పారు. నార్కో పరీక్షలో అఫ్తాబ్ చాలా పెద్ద క్లూస్ ఇచ్చాడని ఓ పోలీసు అధికారి చెప్పారు.

ఆఫ్తాబ్ పూనావాలా చాలా తెలివైన యువకుడని,(Very Clever) శ్రద్ధావాకర్ కేసులో త్వరలో కొత్త ట్విస్ట్ (New Twist)ఉండవచ్చని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో వెలుగుచూడనున్న కొత్త ట్విస్ట్ ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. శుక్రవారం ఆఫ్తాబ్ ను సాకేత్ కోర్టులో హాజరు పర్చాక అసలు విషయం ఏమిటనేది వెలుగుచూడవచ్చని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

Updated Date - 2022-12-09T07:20:40+05:30 IST