Shraddha Murder Case: గుర్తుతెలియని ప్రాంతానికి పరారైన అఫ్తాబ్ కుటుంబసభ్యులు

ABN , First Publish Date - 2022-11-16T20:16:21+05:30 IST

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాకర్ హత్య కేసులో మరో కొత్త పరిణామం చోటుచేసుకుంది. హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలా..

Shraddha Murder Case: గుర్తుతెలియని ప్రాంతానికి పరారైన అఫ్తాబ్ కుటుంబసభ్యులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాకర్ హత్య కేసు(Shraddha Murder Case)లో మరో కొత్త పరిణామం చోటుచేసుకుంది. హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలా కుటుంబీకులు గుర్తుతెలియని ప్రాంతానికి పారిపోయారు. ఎవరికీ చెప్పాపెట్టకుండా, కనీసం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా వారు పరారయ్యారు. ఈ విషయాన్ని మానిక్‌పూర్ పోలీసులు ధ్రువీకరించారు. అఫ్తాబ్ రోజువారీ కార్యక్రమాల గురించి వారికి తెలిసి ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తంచేశారు.

''హడావిడిగా కుటుంబ సభ్యులు మకాం ఎత్తేయడం వెనుక అఫ్యాబ్ కార్యకలాపాల గురించి వారికి తెలిసి ఉండొచ్చు. షిఫ్టింగ్ సమయంలోనూ ఇంటికి అఫ్తాబ్ వచ్చాడు. తనకు కావాల్సిన కొన్ని వస్తువులను ఇంటి నుంచి పట్టికెళ్లాడు. మానిక్‌పూర్ పోలీసులు అఫ్తాబ్ గురించి మొదటిసారి సమన్లు జారీ చేసిన తరువాతే అతని కుటుంబ సభ్యులు ఇల్లు మార్చేశారు'' అని పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా, అఫ్తాబ్ పూనావాలా తనతో సహజీవనం చేస్తున్న శద్ధను 35 ముక్కలుగా నరకి ఒక్కో ముక్క 18 రోజుల పాటు విసిరేసిన మొహ్రాలీ అటవీ ప్రాంతంలో పోలీసులు గాలించి, 10 నుంచి 13 ఎముకలను బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఇవి శ్రద్ధ శరీర భాగాలా? ఏదైనా జంతువులకు చెందిన అవశేషాలా? అనే విషయాన్ని నిర్ధారించేందుకు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. శ్రద్ధ తండ్రి వికాస్ వాకర్ డీఎన్ఏ శాంపుల్స్‌ను కూడా పోలీసులు సేకరించారు.

Updated Date - 2022-11-16T20:18:21+05:30 IST