Shraddha Murder case: అఫ్తాబ్ కస్టడీ పొడిగింపు, వాయిస్ శాంపుల్స్ సేకరణకు అనుమతి

ABN , First Publish Date - 2022-12-23T18:30:34+05:30 IST

శ్రద్ధా వాకర్ దారుణ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు శుక్రవారంనాడు..

Shraddha Murder case: అఫ్తాబ్ కస్టడీ పొడిగింపు, వాయిస్ శాంపుల్స్ సేకరణకు అనుమతి

న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ (Shraddha Walker) దారుణ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా (Aftab Amin poonawala) జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు శుక్రవారంనాడు పొడిగించింది. మరో 14 రోజుల పాటు అఫ్తాబ్‌ను కస్టడీకి అప్పగించింది. దీనికి ముందు డిసెంబర్ 9న కూడా 14 రోజుల కస్టడీని కోర్టు పొడిగించింది. దీనితో పాటు, హత్య కేసు దర్యాప్తులో భాగంగా అఫ్తాబ్ వాయిస్ శాంపుల్స్ తీసుకునేందుకు అనుమతించాలంటూ ఢిల్లీ పోలీసు ఈనెల 22న చేసిన విజ్ఞప్తికి సాకేత్ కోర్టు ఆమోదం తెలిపింది. వాయిస్ శాంపుల్స్ ఇవ్వడానికి నిరాకరించే హక్కు నిందితుడికి లేదని కోర్టు స్పష్టం చేసింది. వాయిస్ శాంపుల్స్‌ను తీసుకునేందుకు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి తీసుకు వెళ్లాల్సిందిగా తీహార్ జైల్ అధికారులను ఆదేశించింది.

శ్రద్ధావాకర్ దారుణ హత్యోదంతం దేశవ్యాప్తంగా ఇటీవల సంచలనం సృష్టించింది. తన జీవిత భాగస్వామిగా ఉన్న శ్రద్ధను 2018లో డేటింగ్ యాప్‌ ద్వారా అఫ్తాబ్ పరిచయం చేసుకున్నాడు. ఈ ఏడాది మే 8న ఇద్దరూ ఢిల్లీ వచ్చారు. మే 18న శ్రద్ధను 35 ముక్కలుగా నరికి చంపిన అఫ్తాబ్ 18 రోజుల్లో ఆ విడిభాగాలను ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు.

Updated Date - 2022-12-23T18:30:36+05:30 IST