Aaftab Poonawala: ఫోరెన్సిక్ ల్యాబ్ బయట ఆఫ్తాబ్‌ను వేసేయాలని..

ABN , First Publish Date - 2022-11-28T20:43:15+05:30 IST

శ్రద్ధా వాకర్ (shraddha walker) హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అఫ్తాబ్ పూనావాలా(Aaftab Poonawala)ను తరలిస్తున్న వ్యాన్‌పై

Aaftab Poonawala: ఫోరెన్సిక్ ల్యాబ్ బయట ఆఫ్తాబ్‌ను వేసేయాలని..

న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ (shraddha walker) హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అఫ్తాబ్ పూనావాలా(Aaftab Poonawala)ను తరలిస్తున్న వ్యాన్‌పై ఢిల్లీలోని ఫోరెన్సిక్ ల్యాబ్ వద్ద దాడి జరిగింది. తన లివిన్ పార్టనర్ అయిన శ్రద్ధను చంపి ముక్కలుగా నరికిన అప్తాబ్‌ను నార్కోఅనాలిసిస్ పరీక్షల కోసం అంబేద్కర్ ఆసుపత్రికి తరలించారు. కత్తితో వచ్చిన దుండగుడు ఫోరెన్సిక్ ల్యాబ్ వద్ద అఫ్తాబ్ ఉన్న వ్యాన్‌పై దాడికి దిగాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వ్యాన్‌పై ఇద్దరు దాడిచేసినట్టు చెబుతున్నారు. అఫ్తాబ్‌తో వెళ్తున్న వ్యాన్‌ను చేజ్ చేసేందుకు ఓ వ్యక్తి దాని వెనక పరుగులు తీయడాన్ని కొందరు తమ ఫోన్లలో చిత్రీకరించారు. నిందితుల్లో ఒకరు మాట్లాడుతూ.. శ్రద్ధకు న్యాయం జరగాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పాడు.

కాగా, తమ కుమార్తె నుంచి కొన్ని నెలలుగా కనిపించడం లేదంటూ శ్రద్ధ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో అఫ్తాబ్ దురాగతం వెలుగులోకి వచ్చింది. మే నెలలోనే ఆమెను చంపేసిన నిందితుడు శరీరాన్ని 35 భాగాలుగా నరికి వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు. కొన్ని భాగాలను భద్ర పరిచేందుకు ఫ్రిడ్జ్‌ను కొనుగోలు చేశాడు. పోలీసుల దర్యాప్తులో వెన్నులో వణుకు తెప్పించే భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయి. శ్రద్ధను హత్య చేసేందుకు ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Updated Date - 2022-11-28T20:43:17+05:30 IST