Delhi Teacher: దారుణం.. 5వ తరగతి బాలికను కిటికీ లోంచి విసిరేసిన టీచర్!
ABN , First Publish Date - 2022-12-16T16:16:44+05:30 IST
విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఓ టీచర్ తాజాగా కనీవినీ ఎరుగని దారుణానికి ఒడిగట్టింది. ఐదవ తరగతి చదువుతున్న ఓ బాలికపై కత్తెరతో దాడి చేసి, ఆ తరువాత విద్యార్థినిని మొదటి అంతుస్తులోని కిటికీ నుంచి కిందకు విసిరేసింది.
న్యూఢిల్లీ: విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఓ టీచర్ తాజాగా కనీవినీ ఎరుగని దారుణానికి ఒడిగట్టింది. ఐదవ తరగతి చదువుతున్న ఓ బాలికపై కత్తెరతో దాడి చేసి, ఆ తరువాత విద్యార్థినిని మొదటి అంతుస్తులోని కిటికీ నుంచి కిందకు విసిరేసింది(girl thrown out of Window). ఒళ్లుగగుర్పొడిచే ఈ ఘటన దేశరాజధాని న్యూఢిల్లీలోని(New Delhi) ఢిల్లీ నగర్ నిగమ్ బాలికా విద్యాలయాలో(Delhi Nagar Nigam Balika Vidyalaya) శుక్రవారం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. నిందితురాలు గీతా దేశ్వాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం నేరం కింద ఆమెపై కేసు నమోదు చేయనున్నారని సమాచారం. ప్రసుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు ప్రాణాపాయం తప్పినట్టు వైద్యులు తెలిపారు.
బాలికపై కోపంతో రెచ్చిపోయిన గీతా ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. అక్కడే ఉన్న మరో ఉపాధ్యాయురాలు రియా..ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మొదటి అంతస్తు నుంచి బాలిక కిందపడటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందింంచారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్కూల్ వద్ద గుమిగూడిన ప్రజలను పంపించేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా.. నిందితురాలు ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టిందో ఇంకా తెలియరాలేదు.