Sharmila: ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-10-27T19:43:17+05:30 IST

ఎమ్మెల్యేల (MLA) కొనుగోలు అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Sharmila: ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై సంచలన వ్యాఖ్యలు
వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల

నిర్మల్: ఎమ్మెల్యేల (MLA) కొనుగోలు అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.100ల కోట్లతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని చూశారట అని షర్మిల ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమాయకులా? లేక బీజేపీ అమాయక పార్టీనా? అని అమె అన్నారు. బీజేపీ ఏమో మా పాత్ర లేదని, అంతా కేసీఅర్ డ్రామా అంటుందని షర్మిల విమర్శించారు. తమని కొనాలని బీజేపీ ప్రయత్నించిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారని, ఫామ్హౌజ్లో మీడియేటర్లను అరెస్ట్ చేశారని షర్మిల తెలిపారు. మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని షర్మిల ప్రశ్నించారు.

Updated Date - 2022-10-27T19:43:17+05:30 IST
Read more