6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీలకు జరిగిన ఉపఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

ABN , First Publish Date - 2022-11-06T08:38:39+05:30 IST

6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీలకు జరిగిన ఉపఎన్నికల కౌంటింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.

6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీలకు జరిగిన ఉపఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

ఢిల్లీ: 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీలకు జరిగిన ఉపఎన్నికల కౌంటింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈరోజే ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశాలో నవంబర్ 3న ఉప ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో అంధేరీ ఈస్ట్, హర్యానా అధంపూర్, తెలంగాణ మునుగోడు, ఉత్తరప్రదేశ్ గోలా గోక్రనాథ్, ఒడిశా ధామ్‌నగర్, బీహార్‌ మొకామాలో, గోపాల్‌గంజ్‌ స్థానాలకు ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఉపఎన్నికల్లో టిఆర్ఎస్, బీజేడీ, ఎస్పీ, ఆర్జేడీ లాంటి ప్రాంతీయ పార్టీలతో బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంది.

Updated Date - 2022-11-06T08:59:37+05:30 IST