ఆ నాలుగు బంగ్లాల్లో ఉన్నట్టుండి అరుపులు, కేకలు... స్థానికులను అడిగితే రకరకాల కథనాలు!

ABN , First Publish Date - 2022-12-08T10:22:22+05:30 IST

ప్రతీ రాష్ట్రంలోనూ కొన్ని భయానక ప్రదేశాలుంటాయి. వీటి గురించి అనేక కథలు కూడా వినిపిస్తుంటాయి. కొన్ని రహస్యాలు ఎప్పటికీ అంతుచిక్కకుండా ఉంటాయి

ఆ నాలుగు బంగ్లాల్లో ఉన్నట్టుండి అరుపులు, కేకలు... స్థానికులను అడిగితే రకరకాల కథనాలు!

ప్రతీ రాష్ట్రంలోనూ కొన్ని భయానక ప్రదేశాలుంటాయి. వీటి గురించి అనేక కథలు కూడా వినిపిస్తుంటాయి. కొన్ని రహస్యాలు ఎప్పటికీ అంతుచిక్కకుండా ఉంటాయి. గుజరాత్ లోనూ ఇటువంటి ప్రాంతాలున్నాయి. ఆ ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అర్హమ్ బంగ్లా

అర్హమ్ బంగ్లా భూతాల నిలయమని చెబుతారు. ఈ బంగ్లా గురించి అనేక రహస్య కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ బంగ్లా నుండి భయానక శబ్దాలు వినిపిస్తాయని, ఆత్మలు సంచరిస్తుంటాయని చెబుతుంటారు. అయితే ఈ విషయాలకు సంబంధించి ఎటువంటి ధృవీకరణ లేదు. స్థానికుల అనుభవం ఆధారంగా ఆత్మలు ఇక్కడ సంచరిస్తుంటాయని చెబుతుంటారు. ఈ ప్రదేశంలో ఒక కుటుంబం హత్యకు గురయ్యిందని, వారి ఆత్మ ఇక్కడ సంచరిస్తుందని అంటారు.

సిగ్నేచర్ ఫామ్

సిగ్నేచర్ ఫామ్‌ను కూడా హాంటెడ్ ప్రదేశంగా పరిగణిస్తారు. అహ్మదాబాద్‌లోని ఈ ప్రదేశంలో భయానక సంఘటనలు చోటు చేసుకున్నాయని చెబుతారు. ఈ కారణంగా ఈ ప్రదేశం రహస్యాలమయం అని చెబుతారు. ఈ ప్రదేశంలో కూడా పారానార్మల్ కార్యకలాపాలు జరుగుతుంటాయంటారు.

అవధ్ ప్యాలెస్

రాజ్‌కోట్‌లో ఉన్న అవధ్ మహల్ కూడా హాంటెడ్ ప్రదేశాల జాబితాలో ఉంది. ఇది అత్యంత పురాతన ప్రదేశం. ఈ ప్రదేశంలో ఒక బాలుడిని చంపి పాతిపెట్టారని, ఆ తర్వాతి నుంచి అక్కడ అతని ఆత్మ సంచరిస్తుందని చెబుతారు. పారానార్మల్ యాక్టివిటీతో పాటు భయానక గొంతులు కూడా ఈ భవనం నుంచి వినిపిస్తాయని చెబుతుంటారు.

గెలాక్సీ, సోలా రోడ్

అహ్మదాబాద్‌లోని సోలా రోడ్డును ఒక రహస్య ప్రదేశంగా గుర్తిస్తారు. ఈ ప్రదేశానికి సంబంధించిన పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ ఉన్న బంగ్లాలో ఎవరూ నివసించరు. బంగ్లాలో అరుపులు వినిపిస్తాయంటారు.

Updated Date - 2022-12-08T10:22:25+05:30 IST