మీ సాయం అందకపోతే సాయన్ మాకు దక్కడు....

ABN , First Publish Date - 2022-04-13T17:51:10+05:30 IST

కొడుకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో చెప్పలేని మానసిక స్థితిలో నేనున్నాను. అమ్మా... నాకేమైంది? అని వాడు అడుగుతుంటే, వాడికి అలా ఎందుకయ్యిందో చెప్పలేక ఏవేవో కథలు...

మీ సాయం అందకపోతే సాయన్ మాకు దక్కడు....

నా కొడుకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో చెప్పలేని మానసిక స్థితిలో నేనున్నాను. అమ్మా... నాకేమైంది? అని వాడు అడుగుతుంటే, వాడికి అలా ఎందుకయ్యిందో చెప్పలేక ఏవేవో కథలు అల్లి, అవి చెబుతూ పొద్దుపుచ్చుతున్నాను. ప్రతివారం థెరపీ కోసం వాడి శరీరంలోకి సూదులు గుచ్చాల్సి ఉంటుంది. నా పిచ్చితండ్రి ఎంత బాధపడుతున్నాడో. వాడిని కాపాడుకోలేక ఒక తల్లిగా నేను విఫలమయ్యాను. మూడేళ్ళ నా కన్నకొడుకు సాయన్‌ని చూసినప్పుడల్లా నా గుండె పగిలిపోతోంది.


"డాక్టర్ గారూ.... నా కొడుకుని కాపాడటానికి ఏదో ఒకటి చెయ్యండి. వాడే నా లోకం. వాడు దూరం కావడమనే ఆలోచనే భరించలేను" అంటూ కన్నీటితో అర్ధించాను. నా భర్త దులా ఒక రోజున సాయన్‌కి స్నానం చేయిస్తున్నప్పుడు బయటపడిన సంగతి ఇది. వాడి శరీరం మీద కిడ్నీల దగ్గర గట్టి ముద్దలాంటి ఒక భాగం కనిపించింది. అది మామూలు విషయంగా అనిపించక వెంటనే దగ్గరున్న ఆస్పత్రికి తీసుకెళ్లాం. కానీ, అక్కడి డాక్టర్లు బాబుని మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లమని సూచన చేశారు.


వరుసపెట్టి చాలా పరీక్షలు, స్కానింగ్స్ చేశాక, బాబు చాలా అరుదైన, ప్రాణాంతకమైన క్యాన్సర్ Wilms' Tumourకి గురైనట్టు చెప్పారు. Wilms' Tumour అనేది పిల్లలకి మాత్రమే సోకే ఒక అరుదైన, అతి ప్రమాదకరమైన కిడ్నీ క్యాన్సర్. ఈ విషయం ఒక పీడకలలా తోచింది. నా గుండె ఆగిపోతుందేమో అనిపించింది. మా అబ్బాయి ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే వరుసగా కొన్ని క్యాన్సర్ థెరపీలు చెయ్యాలి. ఇందుకు రూ.7 లక్షలు (9204.41 డాలర్లు) ఖర్చవుతుందట. నా భర్త ఒక రోజు కూలి. మేం ఎంత కష్టపడినా సాయన్ వైద్యం కోసం అంత డబ్బు సంపాదించలేం.


అందమైన జీవితాన్ని గడపాల్సిన వాడు మా సాయన్. ఎన్నో నెలలుగా వాడు ఈ వేదన అనుభవిస్తున్నాడు. కేవలం మూడేళ్ళ వయసులోనే మా అబ్బాయి జీవిత పోరాటం చేస్తున్నాడు. నా కొడుకుని కాపాడుకునేందుకు మీ సాయం కావాలి. ఏ రకంగా చూసినా సాయన్ చికిత్సకు కావలసిన డబ్బు మేం సమకూర్చుకోలేం. కానీ, వాడికి వీలైనంత త్వరగా వైద్యం చేయించాలని ఎంతో తపన పడుతున్నాం. పెద్ద మనస్సుతో మీరిచ్చే ప్రతి పైసా మా అబ్బాయి చికిత్స కోసం ఉపయోగిస్తాం. ఈ వైద్యం అందకపోతే వాడు మాకు దక్కడు... నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను.


సాయన్ మంచి జీవితాన్ని గడిపేందుకు ఒక అవకాశం ఇవ్వండి.

Updated Date - 2022-04-13T17:51:10+05:30 IST