నా కవలలకు సాయం చేయరూ ప్లీజ్...

ABN , First Publish Date - 2022-06-02T02:06:12+05:30 IST

నెలలు నిండకుండా పుట్టిన నా కవల పిల్లలు అత్యంత బలహీనంగా ఉండి బాధపడుతున్నారు. వారిని కాపాడుకునేందుకు నాకు...

నా కవలలకు సాయం చేయరూ ప్లీజ్...

నెలలు నిండకుండా పుట్టిన నా కవల పిల్లలు అత్యంత బలహీనంగా ఉండి బాధపడుతున్నారు... వారిని కాపాడుకునేందుకు నాకు సాయం చేయరూ ప్లీజ్! 


నా పేరు పూర్ణిమ. నెలలు నిండక ముందే పుట్టి ఇబ్బందులు ఎదుర్కొంటోన్న నా కవలల పిల్లలకు వైద్యం కోసం విరాళాలు సేకరిస్తున్నాను. వైద్య ఖర్చుల కోసం నా కుటుంబం కొంత మొత్తం సేకరించినా మరో పది లక్షల రూపాయలు అవసరమౌతోంది. వైద్యానికి అవసరమవుతున్న మొత్తం ఎక్కువగా ఉండటంతో సాయం కోసం మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.


మాది నిరుపేద కుటుంబం. రెండు పూటలా కడుపు నింపుకోవడానికే నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. నా ఆదాయ పరిస్థితులతో పోల్చి చూస్తే వైద్యం కోసం రూ.10 లక్షలు సేకరించడమన్నది సాధ్యం కాని పని. ఇంత మొత్తాన్ని కలలో కూడా ఊహించలేను. అందుకే మీ సాయం కోరుతున్నాను.


ఈ లింక్ పై క్లిక్ చేసి మీ విరాళం అందించండి...


నా పిల్లల పరిస్థితి గురించి డాక్టర్లు చెప్పినప్పుడు నా గుండె పగిలిపోయింది. నా పిల్లలే నా లోకం... నా సర్వస్వం. వాళ్ళు లేని జీవితాన్ని ఊహించుకోలేను. మా జీవితాలు పండాలంటే నా పసిపాపల బోసినవ్వుల వెలుగులే ఆధారం. ఆ వెలుగులు నిలిచి ఉండటానికి మీవంటి దాతలనే నేను నమ్ముకున్నాను.


ఆర్ధిక సహాయం కోసం బంధువులు, మిత్రులు, తెలిసినవారందరినీ అర్ధించాను. వారిలో చాలామంది ఆర్ధికంగా వెనుకబడినవారే కావడంతో కొందరు తమకి తోచిన చిన్న చిన్న మొత్తాలు అందించారు. చివరికి నేను అతి కష్టం మీద రోజుల తరబడి పొదుపు చేసిన డబ్బు కూడా ఖర్చుపెట్టేశాను. కానీ, ఉదార హృదయంతో పెద్ద మనస్సు చేసుకుని మీరంతా తోడై నిలిస్తేనే ఈ గండం గడిచి గట్టెక్కగలుగుతాను.


ఈ లింక్ పై క్లిక్ చేసి మీ విరాళం అందించండి...


ఒంటి నిండా సూదులు, ట్యూబులతో ఉన్న నా పిల్లలని చూస్తుంటే ఇది చూడటానికేనా నేను బతికున్నదని అనిపిస్తోంది. నాకు, నా పిల్లలకి ఎందుకింతటి శిక్ష? నా పసిప్రాణాల చిరునవ్వులతో నా ఇల్లు మళ్లీ కళకళలాడేలా చెయ్యమని మీ అందరినీ వేడుకుంటున్నాను.


దేవుడున్నాడంటారు. అయితే, ఇప్పుడు ఆ దేవుణ్ణి మీ రూపంలోనే నేను చూస్తున్నాను. నా పిల్లల పాలిట నాకు కనిపిస్తున్న ప్రత్యక్ష దైవాలు మీరే. మీరు చేసే ప్రతి సాయం మాకు విలువైనదే. డొనేట్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు మీ విరాళాన్ని అందజేయవచ్చు. మీ స్నేహితులకు, బంధువులకు దీన్ని షేర్ చేయగలరు. మీ సాయానికి ధన్యవాదాలు.Updated Date - 2022-06-02T02:06:12+05:30 IST