మా బాబును క్రూర విధి నిర్ణయానికి వదిలెయ్యకండి...

ABN , First Publish Date - 2022-04-22T17:22:32+05:30 IST

పుట్టిన కొద్ది క్షణాల్లోనే నా పసి ప్రాణాన్ని 2019లో కోల్పోయాను.

మా బాబును క్రూర విధి నిర్ణయానికి వదిలెయ్యకండి...

పుట్టిన కొద్ది క్షణాల్లోనే నా పసి ప్రాణాన్ని 2019లో కోల్పోయాను. అప్పుడే సగం చచ్చిపోయాను. కిందటేడాది IVF సహాయంతో చివరికి మరోసారి గర్భవతినయ్యాను. అప్పుడు కాస్త ఊపిరి తీసుకున్నాను.


నా పేరు కన్మణి. ఫిబ్రవరి 02, 2022వ తేదీన ప్రీమెచ్యూర్ బేబీకి జన్మనిచ్చాను. అయితే వాడు మెడికల్ సపోర్ట్ లేకుండా జీవించే పరిస్థితి కనిపించడం లేదు. నేను 6 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవ తేదీ దగ్గర పడుతోంది. పుట్టబోయే బిడ్డను ఎంత త్వరగా ఎత్తుకుని ఆడించాలా... అని ఎంతో అతృతతో పరితపించేదానిని.


విరాళాలు ఇచ్చేందుకు ఇక్కడ క్లిక్ చేయండి


కానీ ఒక దురదృష్టకరమైన రోజున నాకు ఎంతో ఒంట్లో ఇబ్బందిగా అనిపించింది. పుట్టబోయే బిడ్డ ప్రమాదకరమైన స్థితిలో ఉన్నట్టు నాకు అనిపించి, వెంటనే ఆస్పత్రికి వెళ్లాం. వెంటనే డెలివరీ చెయ్యకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని, తల్లికి, బిడ్డకు కూడా ప్రమాదం పొంచి ఉన్నట్టు ఆస్పత్రి వైద్యులు చెప్పారని నా భర్త నాకు తెలిపారు.బాబు పుట్టి దాదాపు రెండు నెలలైంది... ఒక్కసారి కూడా వాడిని నా చేతుల్లోకి తీసుకోవడానికి అనుమతించలేదు. ఒక్కో గంటా గడుస్తున్న కొద్దీ, 2019 నాటి దురదృష్టమే మళ్లీ ఎదురవుతుందేమోనని భయంగా ఉంది.


బాబును కాపాడుకోవడానికి చెయ్యగలిగిందంతా చేద్దామని నా భర్త ప్రవీణ్ కూడా అన్నాడు... కానీ, ఆయనలో గూడు కట్టుకున్న భయాన్ని కూడా నేను గమనించకపోలేదు.


విరాళాలు ఇచ్చేందుకు ఇక్కడ క్లిక్ చేయండి


"కన్మణి ఎంతో కష్టపడి పనిచేసే ఒక నర్స్. రోగుల సేవే తన గర్వకారణంగా చెప్పుకునే వ్యక్తిత్వం ఆమెది. కానీ, మా మొదటి బిడ్డను కోల్పోవడం ఆమెను చాలా కుంగదీసింది. తనను తాను క్షమించుకోలేకపోయింది. ఉద్యోగాన్ని కూడా వదులుకోవాలని నిర్ణయించుకుంది" అని కన్మణి భర్త ప్రవీణ్ వివరించాడు.


ఇప్పుడు పుట్టిన బాబుకి NICU సపోర్ట్, మెడికేషన్స్‌కి సుమారుగా రూ.20 లక్షలు (26320.44 డాలర్లు) ఖర్చవుతుందని డాక్టర్లు అంచనా వేశారు. ఇంత పెద్ద ఖర్చును నేను గాని, నా భర్త గాని కలలో కూడా ఊహించే పరిస్థితి లేదు.


ప్రవీణ్ ఒక ప్రయివేట్ కంపెనీలో బొటాబొటీ జీతానికి పనిచేస్తున్నాడు. అయినప్పటికీ, IVF ట్రీట్‌మెంట్ కోసం మేం ఆదా చేసిన సొమ్మంతా ఉపయోగించాలని నిశ్చయించుకున్నాం.


కానీ విధి అనూహ్యంగా మమ్మల్ని దెబ్బ తీసింది... మా బాబు ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రతిక్షణం పరితపిస్తున్నాం.


ప్రతి రోజూ నా బాబు రోదిస్తున్నప్పుడల్లా నా గుండె చెదిరిపోతోంది. మా అబ్బాయి బాధ, వేదనను నాకు ఇమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వాడు దూరమవుతాడేమోనన్న ఊహనే భరించలేకపోతున్నాను. అదే జరిగితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. నా ఊపిరి అడుతోందంటే, అందుకు కారణం వాడే...


విరాళాలు ఇచ్చేందుకు ఇక్కడ క్లిక్ చేయండి


దయచేసి ప్రాణానికి ప్రాణమైన మా బాబును క్రూరమైన విధి నిర్ణయానికి వదిలెయ్యకండి. మాకు సాయం చెయ్యండి.

Updated Date - 2022-04-22T17:22:32+05:30 IST