Pelvi Acetabular ప్రమాదాలు: బాధితులకు ప్రాణగండం... డాక్టర్లకు అగ్నిగుండం

ABN , First Publish Date - 2022-11-17T12:34:59+05:30 IST

స్పీడ్ అండ్ అగ్రెసివ్‌‌నెస్‌తో కూడిన ఒక అల్ట్రా మాడ్రన్ లైఫ్ స్టయిల్ వైపు నేటి యువతరం పయనిస్తోంది. చదువులు, ఆహారం, ఆరోగ్యం విషయంలో ఎంతో అవేర్‌నెస్‌తో యువతీ యువకులు అడుగులేస్తున్నప్పటికీ దీనికి మరో కోణం కూడా ఉంది

Pelvi Acetabular ప్రమాదాలు: బాధితులకు ప్రాణగండం... డాక్టర్లకు అగ్నిగుండం
కొత్త జీవితం

స్పీడ్ అండ్ అగ్రెసివ్‌‌నెస్‌తో కూడిన ఒక అల్ట్రా మాడ్రన్ లైఫ్ స్టయిల్ వైపు నేటి యువతరం పయనిస్తోంది. చదువులు, ఆహారం, ఆరోగ్యం విషయంలో ఎంతో అవేర్‌నెస్‌తో యువతీ యువకులు అడుగులేస్తున్నప్పటికీ దీనికి మరో కోణం కూడా ఉంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో కారు లేని ఇల్లు, బైక్ లేని యంగ్ స్టర్ కనిపించని సోషల్ కల్చర్ తయారవుతూ ప్రతి విషయంలోనూ పోటీ వాతావరణం ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల మధ్య జీవితాన్ని ఒక ఆటలా భావిస్తూ గల్లీల్లో బైక్ రేసులు... హైవేల మీద కార్ రేసులంటూ కాళ్లూ, చేతులూ, అంతకంటే ముఖ్యమైన శరీర భాగాల్ని ఛిద్రం చేసుకుంటున్న సంఘటనలు ఎన్నెన్నో చూస్తున్నాం. మరోవైపు చిన్న చిన్న కారణాలకే సూసైడ్ అంటూ ఎత్తయిన భవనాల పైనుంచి దూకినా చావు రాక.. చావ లేక.. బతుకుతున్న జీవచ్ఛవాలు కూడా మన కంటబడుతుంటాయి. వైద్యరంగం ఎంతో అభివృద్ధి చెందుతూ... ఇలాంటి ఘటనల్లో బతికి బట్టకట్టే అవకాశాలు 10 శాతం మాత్రమే ఉన్న ఎన్నెన్నో సంక్లిష్టమైన కేసుల్ని సైతం ఛేదిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నాయి. అయితే, మన దేహాన్ని నిలబెట్టే అత్యంత ముఖ్యమైన భాగాలైన వెన్ను, తుంటి ఎముకలకు పునాదిగా... వాటికే ప్రాణాధారం లాంటి pelvi acetabular (పెల్వి అసిటాబులర్ - కటివలయం, తొడ ఎముక ఇమడే జఘనాస్థిలోని గిన్నెవంటి అంగాల కలయికతో కూడిన నిర్మాణం) ఇలాంటి ప్రమాదాల్లో దెబ్బ తింటే దాదాపు ఆశలు వదులుకోవాల్సిందే... ఈ పరిస్థితిని pelvi acetabular ట్రామాగా పేర్కొంటారు. రోగులు కోలుకునే అవకాశాలు 99 శాతం లేవని గతంలో భావించే అత్యంత క్లిష్టమైన కేసులకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్న pelvi acetabular సర్జరీ గురించి, ఇందులోని కొత్త టెక్నాలజీ గురించి వివరించారు ఈ సర్జరీలో నిపుణులైన యువ orthopaedic Surgeon డాక్టర్ సి.ఆర్. నాగార్జున...

3.gif

చిన్న సూది తగిలినా...

పొత్తికడుపు కింద ఎన్నో నరాలు, రక్తనాళాలు, యూరినరీ బ్లాడర్‌తో అనుసంధానమయ్యే సంక్లిష్ట వ్యవస్థగా ఉన్న పెల్వి అసిటాబులర్ భాగంలో సర్జరీ అనేది అత్యంత సూక్ష్మ కార్యాచరణతో కూడిన వ్యవహారం. ఇది ఎంత సున్నితమైనదంటే, ఆపరేషన్ చేసేటప్పుడు పొరపాటున చిన్న సూది తగిలినా కాళ్లు చచ్చుబడేంత ప్రమాదకరమైన వ్యవస్థ. అలాంటి చోట సర్జరీ చెయ్యడమంటే పేషెంట్ ప్రాణాలతో చెలగాటమాడటమే... సాధారణంగా వెన్నుకు సర్జరీ చెయ్యడం ఎంతో క్లిష్టమని, రోగికి గ్యారెంటీ లేని విషయంగా చెబుతుంటారు. అయితే, అంతకంటే pelvi acetabular సర్జరీ అనేది కాల్చిన కత్తి మీద సాము లాంటిది... సర్జరీలో ఏ మాత్రం తేడా వచ్చినా మనిషి జీవితం మంచానికే పరిమితమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే pelvi acetabular సమస్య వచ్చిన రోగికే కాదు... అక్కడ సర్జరీకి ఉపక్రమించే డాక్టర్లకు సైతం అదొక నిప్పుల గుండం లాంటిది. యువ డాక్టర్ నాగార్జున ఈ విభాగంలోనే నిపుణుడు కావడం గమనార్హం. అయితే, ప్రస్తుతం pelvi acetabular సర్జన్ల సంఖ్య చాలా పరిమితంగా ఉండగా... వాహన ప్రమాదాలు పెరుగుతూ... pelvi acetabular సర్జన్ల ఆవశ్యకతను వైద్య రంగం గుర్తించి ఈ విభాగం, దీనికి సంబంధించిన టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి సారించిందని డాక్టర్ నాగార్జున తెలియజేశారు.

2.gif

మృతదేహాలపై శిక్షణ ఉంటేనే...

ముఖ్యంగా బైక్ ప్రమాదాల్లో ఎక్కువగా pelvi acetabular సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ నాగార్జున తెలిపారు. ఎందుకంటే, బైక్ మీద కాళ్లు రెండూ అటూ ఇటూ పెట్టుకుని కూర్చుంటాం. మంచి వేగంతో వెళుతున్న బైక్ దేనినైనా ఢీకొట్టినప్పుడు ఒత్తిడి ప్రభావమంతా రెండు కాళ్లకు మధ్యనున్న pelvi acetabular భాగం మీదే పడి, తీవ్ర గాయంతో ఏళ్ల తరబడి మంచానికి పరిమితమయ్యే దుస్థితి వస్తుందన్నారు. Orthopaedicsలో pelvi acetabular సర్జరీలో నిపుణులైన సర్జన్స్ మాత్రమే ఈ పరిస్థితి నుంచి రోగిని గట్టెక్కించగలరు. అగ్నిగుండం లాంటి pelvi acetabular సర్జరీల్లో నైపుణ్యం కలిగిన వైద్యులు దొరకడం అంత తేలికైన వ్యవహారం కాదు. ఇందులో నైపుణ్యం కోసం సంబంధిత సర్జన్లు పెద్ద సంఖ్యలో అధికభాగం శిక్షణ మృతదేహాలపైనే జరిగే Cadavaric workshopsలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇలాంటి వర్క్ షాప్స్‌లో తాను పాల్గొని కఠినమైన శిక్షణతో బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్ కావడం వలన, గడచిన నాలుగేళ్ళ కాలంలో దాదాపు 3 వేలకు పైగా సర్జరీలు చేసిన వైద్య బృందాల్లో సభ్యుడిగా సీనియర్ ఆర్థోపెడిక్స్‌తో కలసి ఎందరో ప్రమాద బాధితులకు కొత్త జీవితాన్ని అందించగలిగానని డాక్టర్ నాగార్జున అన్నారు.

pal.gif

జీవితాల్ని నిలబెట్టే ఒక్క స్క్రూ...

ఎముకల సమస్యలకు శస్త్రచికిత్సల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రమాణాలు నిర్ధారించే Ao Trauma అంతర్జాతీయ సంస్థ సభ్యుడు కూడా అయిన డాక్టర్ నాగార్జున Hip joint, Knee Joint, Shoulder Joint సర్జరీల్లో నిపుణుడిగా fully automatic 3rd generation roboల వినియోగంలో సైతం శిక్షణ అందుకుని Bangaloreలోని RMC, Sakra World Hospital (Japan & Korea Collaboration) నుంచి సర్టిఫికేషన్ సాధించారు. సుమారు 700కు పైగా జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీల అనుభవం కలిగిన ఈ యువ వైద్యుడు... సర్జరీలలో కీ హోల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ రక్తం వృధా కాకుండా కచ్చితత్వం, అతి తక్కువ కోతతో రోగికి త్వరగా ఉపశమనం కలిగించేలా చేయవచ్చన్నారు. ఇదే కీహోల్ టెక్నిక్స్‌ని సంక్లిష్టమైన pelvi acetabular సర్జరీల్లోనూ అవలంబిస్తూ అద్భుత విజయాలు సాధిస్తున్నామని చెప్పారు. ఎంతగా అంటే... సరైన స్థానంలో ఒక్క స్క్రూ వెయ్యడం ద్వారా ఒక జీవితం నిలబడేలా.... అని వివరించారు. ఫలితంగా గతంలో ఫెయిల్ అయి తమ వద్దకు వచ్చిన బాధితులకు ఉపశమనం ఇస్తున్నామన్నారు. జాయింట్ రీప్లేస్‌మెంట్స్, కీ హోల్ సర్జరీలకు సంబంధించిన International society of arthroplasty and arthroscopyలో సభ్యుడు కూడా అయిన డాక్టర్ నాగార్జున తాను పనిచేస్తున్న యశోదా హాస్పిటల్స్ ద్వారా ఆరోగ్య భద్రత పేరిట పోలీస్, కోల్ ఫీల్డ్స్, ఎన్టీపీసీ, రైల్వే తదితర ప్రభుత్వ విభాగాల సిబ్బందికి సేవలందిస్తూ వారిలో ఆరోగ్య అవగాహన పెంచుతున్నారు.

dr c r nagarjuna.jpg-డాక్టర్ సి.ఆర్. నాగార్జున... orthopaedic Surgeon

National Academy of Medical Sciences (MNAMS), New Delhi సభ్యుడు కూడా అయిన డాక్టర్ నాగార్జున స్వస్థలం తిరుపతి. తల్లి బాల విజయలక్ష్మి టీచర్ కాగా, తండ్రి దివంగత సిఆర్ రాంప్రసాద్ పోలీస్ విభాగంలో పనిచేసేవారు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్ నాగార్జున.... పలు ఒత్తిళ్ల మధ్య పోలీస్ శాఖలో పనిచేసిన తన తండ్రి, ఆయన సహచరులు ఎదుర్కున్న వెన్ను, తుంటి సంబంధిత సమస్యలను గమనించి, ఈ విభాగంలో నైపుణ్యం సాధించి బాధితులకు వైద్యం అందించాలనే సంకల్పంతో వైద్య రంగంలో ఈ దిశగా అడుగులు వేశారు. ఆయన సతీమణి డాక్టర్ పునీత శిశు వైద్య నిపుణురాలు.

Updated Date - 2022-11-18T22:46:30+05:30 IST