Winter: దుర్వాసన రాకుండా ఉండాలంటే..!

ABN , First Publish Date - 2022-12-15T11:44:01+05:30 IST

అసలే చలికాలం(Winter). ఎక్కడ ఉండే తేమ అక్కడ ఉంటుంది. నీళ్లు పడినా త్వరగా ఆరిపోవు. ఇళ్లంతా ముసురు వాసన కమ్మినట్లుంటుంది. ముక్కులకు దుర్వాసన రాకుండా

Winter: దుర్వాసన రాకుండా ఉండాలంటే..!
దుర్వాసన రాకుండా ఉండాలంటే..!

అసలే చలికాలం(Winter). ఎక్కడ ఉండే తేమ అక్కడ ఉంటుంది. నీళ్లు పడినా త్వరగా ఆరిపోవు. ఇళ్లంతా ముసురు వాసన కమ్మినట్లుంటుంది. ముక్కులకు దుర్వాసన రాకుండా ఉండాలంటే.. కొన్ని చిట్కాలు(Tips) పాటించాల్సిందే.

  • కొందరు ఇళ్లంతా ఒక విధమైన వాసన అంటూ బాధపడుతుంటారు. ముఖ్యంగా గాలి తగిలితే ఈ వాసన పోతుంది. అందుకోసం తలుపులు, కిటికీలు ఎక్కువ సమయం తెరచి ఉంచాలి. దీని వల్ల బయటిగాలి ఇంట్లోకి వచ్చి చెడు వాసన(bad smell) ఉండదు.

  • దుప్పట్లు, కార్పెట్స్‌, ఫర్నిచర్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బట్టలు, తువాళ్లు విషయంలో కూడా అలానే ఉండాలి. ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి.

  • వంటగది(kitchen)లో సింక్‌ ఉండే ప్రాంతం, నిల్వ ఉండే ఆహారపదార్థాలు, కింద పడిన తిండి పదార్థాల వల్ల కూడా చెడు వాసన వస్తుంది. వీటి విషయంలో జాగ్రత్త పాటించాల్సిందే.

  • అగరబత్తీల వాసన కూడా ఇంట్లోని చెడును పోగొడుతుంది. కొత్త ఫీల్‌ను తెస్తుంది. లైట్‌ క్యాండిల్స్‌, డిఫ్యూజర్స్‌ సరికొత్తని లుక్‌తో పాటు గదిని అందంగా చేస్తాయి కూడా.

  • రూమ్‌ ఫ్రెష్‌నర్స్‌ వాడితే చక్కటి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా వాష్‌రూమ్స్‌(Washrooms)లో వాడటం తప్పనిసరి!

  • ఏమీ లేకపోతే సిట్రస్‌ ఆమ్లం ఉండే నిమ్మ, నారింజ పండ్ల తొక్కలు తీసి బౌల్‌లో వేసుకుని చిన్న మంట మీద ఇరవై నిమిషాలు వేడిచేస్తే.. వాటినుంచి మంచి సువాసన వస్తుంది.

  • వంటగదిలో గ్రాసరీస్‌ నిల్వచేసే డబ్బాలు పొడిగా ఉండేట్లు చూసుకోవాలి. కూరగాయలు, పండ్లు నుంచి వచ్చే వేస్ట్‌ను ఇంట్లో పడకుండా చూసుకోవాలి.

  • మంచి వాసన ఉండే పూలతో ఇంట్లో ఒక పాజిటివ్‌, హ్యాపీ మూడ్‌ క్రియేట్‌ అవుతుంది. ఇక ఎండిపోయిన పూలను కూడా ఒక బుట్టలో వేసుకుంటే మంచి వాసన ఉంటుంది.

Updated Date - 2022-12-15T11:45:34+05:30 IST