Psychology: డిప్రెషన్‌తో ఢీ

ABN , First Publish Date - 2022-12-13T16:42:10+05:30 IST

డిప్రెషన్‌ ఎప్పుడైనా, ఏ వయసులోనైనా రావొచ్చు. ఈ రుగ్మత వ్యక్తి ఆలోచించే విధానాన్ని, పనితీరును ప్రభావితం చేస్తుంది. పరిమితి దాటితే దైనందిన జీవితాన్ని కూడా దెబ్బతీసి

Psychology: డిప్రెషన్‌తో ఢీ
డిప్రెషన్‌తో ఢీ

డిప్రెషన్‌ ఎప్పుడైనా, ఏ వయసులోనైనా రావొచ్చు. ఈ రుగ్మత వ్యక్తి ఆలోచించే విధానాన్ని, పనితీరును ప్రభావితం చేస్తుంది. పరిమితి దాటితే దైనందిన జీవితాన్ని కూడా దెబ్బతీసి ఆత్మహత్యకు పురిగొల్పేంత తీవ్రంగానూ పరిణమిస్తుంది. దీనికి తక్షణ చికిత్స లేకపోయినా, లక్షణాలను గుర్తించి దీర్ఘకాల చికిత్స తీసుకోగలిగితే డిప్రెషన్‌ నుంచి బయటపడొచ్చు.

లక్షణాలు ఏవంటే?

  • నిరాశగా అనిపించటం.

  • విపరీతమైన ధోరణిలో కోపాన్ని ప్రదర్శించటం

  • నిద్రాభంగం, మతిమరుపు

  • చిరాకు, విసుగు

  • ఆకలిలో తీవ్రమైన మార్పులు (పెరగటం, తగ్గటం)

  • తలనొప్పి, వెన్ను నొప్పి

  • ఎందుకూ పనికిరామనే భావన కలగటం, ఆత్మన్యూనత కలిగి ఉండటం.

  • ఆత్మహత్యకు లేదా హింసకు పాల్పడాలనే ఆలోచనలు తరచుగా రావటం.

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే మానసిక వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. డిప్రెషన్‌కు కారణాలు ఎన్నో ఉంటాయి. వ్యక్తిగత జీవితంలో అవకతవకలు, వ్యాధులు, హార్మోన్లలో హెచ్చుతగ్గులు, ఒత్తిడి, బాధ, మత్తు పదార్థాలు... డిప్రెషన్‌కు ప్రధానమైన కారణాల్లో ఇవి కొన్ని. కారణాలనుబట్టి చికిత్స అందిస్తే ఈ రుగ్మత నుంచి తేలికగానే బయటపడొచ్చు.

Updated Date - 2022-12-13T16:42:11+05:30 IST