Himachal Results: కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న హిమాచల్ ప్రదేశ్ సీఎం

ABN , First Publish Date - 2022-12-08T16:04:42+05:30 IST

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. మరోవైపు ప్రజా తీర్పును గౌరవిస్తూ ..

Himachal Results: కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న హిమాచల్ ప్రదేశ్ సీఎం

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ (Himachal pradesh) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. మరోవైపు ప్రజా తీర్పును గౌరవిస్తూ మరి కాసేపట్లో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌కు తన రాజీనామాను సమర్పించనున్నట్టు హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ (Jairam Thakur) తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని, గత ఐదేళ్లుగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించిన ప్రధాని, కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని ఆయన అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తాము కట్టుబడి ఉంటామని అన్నారు. ఎన్నికల ఫలితాలను విశ్లేషించి, ఎక్కడ ఇబ్బందులు తలెత్తాయో తెలుసుకుని వచ్చే ఎన్నికల నాటికి అధిగమించి మెరుగైన ఫలితాలు సాధిస్తామని అన్నారు.

సెరజ్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న జైరామ్ ఠాకూర్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతానికి 38,183 ఓట్ల ఆధిక్యంతో గెలుపునకు చేరువలో ఉన్నారు. మొత్తం 68 స్థానాలకు గాను కాంగ్రెస్ 39 స్థానాల్లో గెలుపు సాధించగా, బీజేపీ 23 స్థానాలు గెలిచి, 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Updated Date - 2022-12-08T16:04:43+05:30 IST