దిన దిన గండం దాటాల్సిందే..

ABN , First Publish Date - 2022-08-31T16:42:21+05:30 IST

కర్నూలు(Kurnool) జిల్లాలోని ఎస్‌హెచ్‌ ఎర్రగుడి, కొత్తపల్లి, మన్నెగుంట గ్రామాల విద్యార్థులు గోరంట్లలోని ఉన్నత పాఠశాల(high school)కు వెళ్లాలంటే ఈ నదిని

దిన దిన గండం దాటాల్సిందే..

కోడుమూరు రూరల్: కర్నూలు(Kurnool) జిల్లాలోని ఎస్‌హెచ్‌ ఎర్రగుడి, కొత్తపల్లి, మన్నెగుంట గ్రామాల విద్యార్థులు గోరంట్లలోని ఉన్నత పాఠశాల(high school)కు వెళ్లాలంటే ఈ నదిని దాటాల్సిందే. నీటి ఉధృతి ఎక్కువగా ఉంటే.. స్కూలుకు ఎగనామం పెట్టాల్సిందే. ఇక్కడ ఎర్రగుడి గ్రామస్థులు విరాళాలు వేసుకుని మట్టిరోడ్డు వేసుకున్నారు. అది కాస్తా సోమవారం వచ్చిన వరదకు కొట్టుకుపోయింది. ఇప్పుడు అక్కడ రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే బండారాళ్లే మిగిలాయి. మంగళవారం నదిలో మోకాలి లోతులో నీరు ప్రవహించింది. ఆ రాళ్లను పట్టుకుని నడుస్తూ.. అవస్థలు పడుతూ.. విద్యార్థులు(students) హంద్రీ నదిని దాటి స్కూలుకు వెళ్లారు. ఇక్కడ వంతెన నిర్మిస్తానని పాదయాత్రలో జగన్‌ హామీ ఇచ్చారు. ఇంతవరకూ పట్టించుకోలేదు.

Read more