యార్లగడ్డకు మరో పదవి.. AU ప్రొఫెసర్‌గా నియామకం

ABN , First Publish Date - 2022-10-04T20:23:22+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగం గౌరవ ప్రొఫెసర్‌గా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉపకులపతి పీవీజీడి

యార్లగడ్డకు మరో పదవి.. AU ప్రొఫెసర్‌గా నియామకం

ఏయూ హిందీ గౌరవ ప్రొఫెసర్‌గా యార్లగడ్డ


విశాఖపట్నం, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగం గౌరవ ప్రొఫెసర్‌గా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉపకులపతి పీవీజీడి ప్రసాద్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. హిందీ భాష, సాహిత్యాన్ని ప్రోత్సహించడంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా గౌరవ ప్రొఫెసర్‌గా నియమించినట్టు అధికారులు తెలిపారు. పది రోజుల క్రితం ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్‌టీఆర్ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.. అధికార భాషా సంఘం, తెలుగు భాషా సాధికారిత సంస్థ, హిందీ అకాడమీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే.

Read more