ట్రిపుల్‌ ఐటీ కష్టాలు తీరేనా?

ABN , First Publish Date - 2022-09-26T17:09:47+05:30 IST

రాష్ట్రవిభజన తర్వాత మనకు మిగిలింది ఒక్కటే బాసర ట్రిపుల్‌ఐటీ(Basara TripleIT) (ఆర్జీయూకేటీ). రాష్ట్రంలో ఉన్న ఏకైకట్రిపుల్‌ ఐటీసమస్యలకు నిలయంగా మారింది. 2008లో ఏర్పాటై 14 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి ఇంకా మౌలికవసతులు కరువవుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఐటీశాఖ మంత్రి

ట్రిపుల్‌ ఐటీ కష్టాలు తీరేనా?

నేడు విద్యార్థుల చెంతకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ రాక 

మరో ఇద్దరు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి సైతం 


బాసర, సెప్టెంబరు, 25 : రాష్ట్రవిభజన తర్వాత మనకు మిగిలింది ఒక్కటే బాసర ట్రిపుల్‌ఐటీ(Basara TripleIT) (ఆర్జీయూకేటీ). రాష్ట్రంలో ఉన్న ఏకైకట్రిపుల్‌ ఐటీసమస్యలకు నిలయంగా మారింది. 2008లో ఏర్పాటై 14 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి ఇంకా మౌలికవసతులు కరువవుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఐటీశాఖ మంత్రి కె.తారకరామరావు(IT Minister K. Tarakara Rao), విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఏకంగా ముగ్గురు మంత్రులు వస్తుండడంతో యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.. 


రాష్ట్రంలో మరేఇతర యూనివర్సిటీల్లో లేని విధంగా పదవతరగతి తర్వాత ప్రవేశం కల్పించి విద్యార్థులు ఇంజనీరింగ్‌ కోర్సు పూర్తి చేసుకుంటారు. కార్పొరేట్‌స్థాయిలో విద్యాభ్యాసానికి గాని, విద్యార్థులు ఉండడానికి అవసర మైన  మౌలిక సౌకర్యాలను అందుబాటులో ఉంచుతుంది. కరోనా తర్వాత ట్రిపుల్‌ఐటీలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిధులు రాక అనేక సమ స్యలు తలెత్తగా మరికొన్ని దీర్ఘకాల అపరిష్కృత సమస్యలు అలాగే ఉన్నా యి. ప్రస్తుతం యూనివర్సిటీలో విద్యార్థులు ఉండడానికి సరియైున వసతు లు లేవు. చదువుకోవడానికి అధ్యాపకులు లేరు. సరియైున సమయానికి పుస్తకాలు అందడం లేదు. తినడానికి సరియైున భోజనం దొరకదు అనారోగ్యానికి గురైతే ఇంటికెళ్లాల్సిన పరిస్థితి. ప్రతిరోజు సమస్యలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు జూన్‌ రెండవవారంలో వారంరోజుల పాటు ఆందో ళనకు దిగారు. తమ డిమాండ్లపై స్పష్టత వచ్చే వరకు విరమించలేదు. 


డిమాండ్లలో మొదటిదైన ముఖ్యమంత్రి కేసీఆర్‌(Chief Minister KCR) లేదంటే మంత్రి కేటీఆర్‌ బాసర రావాలనే డిమాండ్‌ ఎట్టకేలకు సోమవారం నెరవేర బోతుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమస్యలపై ఒప్పించి మంత్రి కేటీఆర్‌ను ట్రిపుల్‌ ఐటీకి తీసుకవస్తామని హామీ ఇవ్వడంతో ఆ నాడు విద్యార్థులు ఆందోళన విరమించిన విషయం తెలిసిందే. 


ఎనిమిదేళ్లుగా రెగ్యులర్‌ వీసీకి లభించని మోక్షం 

రాష్ట్రవిభజన తర్వాత మిగిలిన బాసర ఆర్జీయూకేటీకి నేటి వరకు వీసీ పోస్టు భర్తీ కాలేదు. ముగ్గురు ఇన్‌చార్జీలు మారిన అనంతరం ప్రస్తుతం, ఇన్‌చార్జీనే కొనసాగుతున్నారు. 9 వేలమంది విద్యార్థులు ఉన్న ఈ యూని వర్సిటీకి రెగ్యులర్‌వీసీగా పెద్ద దిక్కులేక అనేక ఇబ్బందులు తలెత్తుతు న్నాయి. డైరెక్టర్‌, డీన్‌, పరిపాలన అధికారి ఇలా అన్ని ఉన్నతస్థాయి పోస్టు లన్నీ ఖాళీగా ఉన్నాయి. 200 అధ్యాపక పోస్టులు అవసరముంది.


తగ్గిపోతున్న నిధుల కేటాయింపు 

2014 లో రూ. 119 కోట్ల నిధులు కేటాయిస్తే ఈ ఏడాది కేవలం రూ. 29 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. గడిచిన ఎనిమిదేళ్లలో ట్రిపుల్‌ ఐటీ అధికారులు రూ. 1160 కోట్లు ప్రతిపాదనలు పంపిస్తే అందులో రాష్ట్రప్రభుత్వం తనబడ్జెట్‌లో రూ.490 కోట్లు కేటాయిం చగా కేవలం రూ. 294ల కోట్ల నిధులు మాత్రమే యూనివర్సిటీకి వచ్చాయి. 


మూడేళ్ల నుంచి ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు స్కాలర్‌షిప్‌(Triple IT Students Scholarship)లు అందడం లేదు. దాదాపు రూ. 100 కోట్లు విడుదలకు పెండింగ్‌లో ఉన్నాయి. యూనిపామ్స్‌, అవసరమైన లాప్‌టాప్‌లు(Laptops) అందడం లేదు. Read more