Malaysiaలో తెలుగు భాషా పీఠం

ABN , First Publish Date - 2022-08-16T18:13:24+05:30 IST

మలేషియా(Malaysia)లో తెలుగు భాష, సంస్కృతులను ఆ దేశంలోని తెలుగువారు కాపాడడం సంతోషకరమని, అక్కడి తెలుగు సంఘం సహకరిస్తే మలేషియాలో తెలుగు భాషా పీఠాన్ని ఏర్పాటు చేయడానికి తెలుగు

Malaysiaలో తెలుగు భాషా పీఠం

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు15(ఆంధ్రజ్యోతి): మలేషియా(Malaysia)లో తెలుగు భాష, సంస్కృతులను ఆ దేశంలోని తెలుగువారు కాపాడడం సంతోషకరమని, అక్కడి తెలుగు సంఘం సహకరిస్తే మలేషియాలో తెలుగు భాషా పీఠాన్ని ఏర్పాటు చేయడానికి తెలుగు యూనివర్సిటీ(Telugu University) సుముఖంగా ఉన్నట్లు వీసీ ప్రొఫెసర్‌ టీ.కిషన్‌రావు వెల్లడించారు. మలేషియా తెలుగు  సంఘం ప్రతినిధులు పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీని సోమవారం సందర్శించారు. వీసీ వారిని సత్కరించారు. అనంతరం మలేషియా తెలుగు సంఘం ప్రధాన సలహాదారులు డాక్టర్‌ అచ్చయ్యకుమార్‌ మాట్లాడుతూ తెలుగువారి సంక్షేమం కోసం ఇటీవల నూతనంగా సకల సదుపాయాలతో భవనాన్ని నిర్మించామని, అక్కడ ఆసక్తిగల పిల్లలకు ప్రాథమిక స్థాయిలో తెలుగు సర్టిఫికెట్‌ కోర్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు. 

Read more