Posts: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రైమరీ టీచర్లు.. భారీగా ఖాళీలు..!

ABN , First Publish Date - 2022-12-06T12:35:52+05:30 IST

కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌(కేవీఎస్)... దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రీయ విద్యాలయాల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ప్రైమరీ టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిషికేషన్‌ విడుదల చేసింది. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) ద్వారా అభ్యర్థులను కేవీఎస్‌ ఎంపిక చేస్తుంది.

Posts: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రైమరీ టీచర్లు.. భారీగా ఖాళీలు..!
ప్రైమరీ టీచర్లు.. భారీగా ఖాళీలు..!

మొత్తం ఖాళీలు 6414

కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌(కేవీఎస్)... దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రీయ విద్యాలయాల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ప్రైమరీ టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిషికేషన్‌ విడుదల చేసింది. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) ద్వారా అభ్యర్థులను కేవీఎస్‌ ఎంపిక చేస్తుంది.

పోస్టు: ప్రైమరీ టీచర్‌

ఖాళీల సంఖ్య: 6414(ఆన్‌ రిజర్వ్‌డ్‌-2599, ఓబీసీ-1731, ఎస్సీ-962, ఎస్టీ-481, ఈడబ్ల్యూఎస్‌-641)

అర్హత: సీనియర్‌ సెకండరీ, డీఈఎల్‌ఈడీ, డీఈఎల్‌ఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌). లేదా సీనియర్‌ సెకండరీ, బీఈఎల్‌ఈడీ లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణతతోపాటు సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ పేపర్‌-1 లో అర్హత సాధించి ఉండాలి.

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు

జీతభత్యాలు: రూ.35,400-రూ.1,12,400

ఎంపిక విధానం: రాత పరీక్ష, క్లాస్‌ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఏపీ, తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, వరంగల్‌

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు రుసుము: రూ.1500. ఎస్సీ/ఎస్టీ/, ఎక్స్‌ సర్వీస్‌మన్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 26

వైబ్‌సైట్: https://kvsangathan.nic.in/

KV-Logo.gif

Updated Date - 2022-12-06T12:35:53+05:30 IST