వనపర్తిలో వచ్చే ఏడాది నుంచే మెడికల్‌ కళాశాల తరగతులు

ABN , First Publish Date - 2022-02-03T20:59:47+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం వనపర్తి జిల్లాకు మంజూరు చేసిన మెడికల్‌ కళాశాల ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ బృందం సోమవారం జిల్లా ఆస్పత్రితో పాటు నూతనంగా నిర్మించిన ఎంసీహెచ్‌ను, దాని పక్కనే తాత్కాళికంగా...

వనపర్తిలో వచ్చే ఏడాది నుంచే మెడికల్‌ కళాశాల తరగతులు

తాత్కాలిక ఏర్పాట్లను పరిశీలించిన  నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌

జిల్లా ఆస్పత్రి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌

వైద్యులు, పారామెడికల్‌ స్టాఫ్‌తో పాటు సిబ్బంది కేటాయింపు 

పూర్తిఎన్‌ఎంసీ అనుమతిస్తే మొదటి సంవత్సరం 150 మందికి ప్రవేశం

మెడికల్‌ కళాశాల అనుబంధంగా 330 పడకలు


వనపర్తి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం వనపర్తి జిల్లాకు మంజూరు చేసిన మెడికల్‌ కళాశాల ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ బృందం సోమవారం జిల్లా ఆస్పత్రితో పాటు నూతనంగా నిర్మించిన ఎంసీహెచ్‌ను, దాని పక్కనే తాత్కాళికంగా తరగతుల కోసం నిర్మించిన భవనాలను, వసతులను పరిశీలించింది. వసతులపై వారు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కళాశాల నిర్వహణకు సంబంధించిన పనులను వైద్య విద్య విభాగం అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. టీఎస్‌ ఎంఐడీసీ (తెలంగాణ మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌) ఆధ్వర్యంలో కళాశాలకు కావాల్సిన సౌకర్యాలను సమకూరు స్తున్నారు. ఇప్పటికే సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు, ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సూపరిం టెండెంట్‌ల నియామకం పూర్తవగా, హెడ్‌నర్సులు, స్టాఫ్‌ నర్సులు, ఇతర పారామెడికల్‌, నాన్‌ పారా మెడికల్‌ సిబ్బంది నియామకం కూడా పూర్తయ్యింది. వారందరూ విధుల్లో జాయిన్‌ అయ్యారు. ప్రస్తుతం ఎంసీహెచ్‌ దగ్గర తరగతుల నిర్వహణకు తాత్కాలికంగా ఏర్పాట్లు చేస్తుండగా, కళాశాల నిర్మాణం కోసం స్థలం కూడా కేటా యిం చారు. సీఎం కేసీఆర్‌ జిల్లాలో పర్యటించి, శంకుస్థాపన చేసిన తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి. మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా మంజూరు చేసిన నర్సింగ్‌ కళాశాల పనులు పురోగతిలో ఉన్నాయి. 


జీజీహెచ్‌గా అప్‌గ్రేడ్‌
జిల్లాలు ఏర్పడక ముందు వనపర్తిలో ఏరియా ఆస్పత్రి మాత్రమే ఉండేది. జిల్లా ఏర్పాటు తర్వాత దాన్ని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేశారు. ప్రస్తుతం మెడికల్‌ కళాశాల మంజూరు కావడంతో జిల్లా ఆస్పత్రిని ప్రభుత్వ జనరల్‌ దావాఖానగా మారుస్తూ, ప్రభుత్వం కొద్ది రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కావాల్సిన వైద్యులను కూడా నియమించింది. మొత్తం 60 మంది డాక్టర్లను నియమించగా, 29 మంది సీనియర్‌ రెసిడెంట్‌ డాక్ట ర్లు, తొమ్మిది మంది ప్రొఫెసర్లు, నలుగురు అసోసి యేట్‌ డాక్టర్లు, 17 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఒక సూపరింటెండెంట్‌ నియామకం పూర్తయ్యింది. అలాగే 112 మంది స్టాఫ్‌ నర్సులను నియమించగా, 94 మంది ఇప్పటివరకు రిపోర్ట్‌ చేశారు. ఐదుగురు హెడ్‌ నర్సులను నియమించగా, 89 మంది ఇతర స్టాఫ్‌ను తీసుకున్నారు. 2022 ఆగస్టు నాటికి మెడికల్‌ కళాశాలకు కావాల్సిన అన్ని వసతులు సమకూరిస్తే ఎన్‌ఎంసీ బృందం మరోసారి పర్యటించి ప్రవేశాలకు అనుమతి ఇవ్వనుంది. 2023 నుంచి 150 మంది విద్యార్థులతో మొదటి సంవత్సరం క్లాసులు ప్రారం భం అవుతాయి. మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా 300 పడకల ఆస్పత్రి అవసరం ఉండగా, జీజీహెచ్‌లో 150 పడకలు, ఎంసీహెచ్‌లో 180 పడకలు కలిపి మొత్తం 330 పడకలు అందు బాటులో ఉన్నాయి. మెడికల్‌ కళాశాలకు అనుబం ధంగా 600 పడకల ఆస్పత్రి కూడా నిర్మించనున్న నేపథ్యంలో తాత్కాళికంగా వీటిని ఉపయోగించుకోనున్నారు. 

ఏర్పాట్లపై సంతృప్తి 
వనపర్తికి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ మంజూరైన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లా ఆస్పత్రిని జనరల్‌ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేశారు. కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే డాక్టర్లు, పారా మెడికల్‌ స్టాఫ్‌, సిబ్బంది జాయిన్‌ అయ్యారు. తరగతుల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాం. నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ బృందం ఇటీవల జిల్లాలో పర్యటించింది. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసింది. వారు అనుమతిస్తే ఎప్పటి నుంచి ప్రారం భమవుతాయో తెలిసే అవకాశం ఉంది.
- నరేందర్‌, జీజీహెచ్‌, సూపరింటెండెంట్‌, వనపర్తి

Updated Date - 2022-02-03T20:59:47+05:30 IST