ఇక ఎంసీఏ రెండేళ్లే!

ABN , First Publish Date - 2022-03-05T17:18:40+05:30 IST

మాస్టర్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌ (ఎంసీఏ)ను ఇక రెండేళ్లలోనే పూర్తి చేయవచ్చు. ఈ కోర్సు కాలవ్యవధిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గిస్తూ

ఇక ఎంసీఏ రెండేళ్లే!

అమరావతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): మాస్టర్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌ (ఎంసీఏ)ను ఇక రెండేళ్లలోనే పూర్తి చేయవచ్చు. ఈ కోర్సు కాలవ్యవధిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ శుక్రవారం నోటిఫికేషన్‌ ఇచ్చింది. మరోవైపు బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ కోర్సు కాలవ్యవధిని నాలుగు నుంచి నాలుగున్నరేళ్లకు పెంచారు. బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సును డిగ్రీ స్థాయిలో ప్రవేశపెట్టారు. ఇంటర్‌ చదివినవారు దీనిలో చేరవచ్చు. మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సును రెండేళ్ల కాలావధిలో కొత్తగా ప్రవేశపెట్టారు.


అలాగే అర్బన్‌ డిజైన్‌లో కొత్తగా నాలుగేళ్ల బ్యాచ్‌లర్‌ డిగ్రీ, రెండేళ్ల మాస్టర్‌ డిగ్రీలను ప్రవేశపెట్టారు. మరోవైపు బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ స్పోర్ట్సును మూడేళ్ల కాలావధిలో, మాస్టర్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ను రెండేళ్ల కాల వ్యవధిలో పూర్తిచేసేలా కొత్త కోర్సులకు అనుమతించారు. స్పోర్ట్స్‌ సైన్స్‌లో కూడా కొత్త కోర్సులకు అనుమతించారు. మూడేళ్ల డిగ్రీగా బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ సైన్స్‌, రెండేళ్ల డిగ్రీగా మాస్టర్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ సైన్స్‌ కోర్సులను ప్రవేశపెట్టామని యూజీసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

Updated Date - 2022-03-05T17:18:40+05:30 IST