‘మన ఊరు-మన బడి’కి నిధుల సర్దుబాటు

ABN , First Publish Date - 2022-03-05T17:09:41+05:30 IST

మన ఊరు-మన బడి పథకానికి అవసరమైన నిధులను ఇతర శాఖల నుంచి సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.

‘మన ఊరు-మన బడి’కి నిధుల సర్దుబాటు

హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): మన ఊరు-మన బడి పథకానికి అవసరమైన నిధులను ఇతర శాఖల నుంచి సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులతో పాటు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిధుల నుంచి మళ్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు నిధుల సమీకరణకు సంబంధించి అధికారుల కసరత్తు పూర్తయింది. మన ఊరు-మన బడి పథకానికి అవసరమైన నిధులపై బడ్జెట్‌లో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ పథకానికి దాతల నుంచి కూడా నిధులు సమీకరించాలని భావిస్తున్నారు. ఈ నెల 8నముఖ్యమంత్రి కేసీఆర్‌ వనపర్తిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఈ పథకం అమలుపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. 

Read more