ఐబీసీ కాంటినమ్, వెబ్ 3.0 ఆల్ట్ హ్యాక్‌ను ప్రారంభించిన ఇంటర్నేషనల్ బ్లాక్‌చైన్ కాంగ్రెస్

ABN , First Publish Date - 2022-11-22T21:28:35+05:30 IST

దేశవ్యాప్తంగా ఉన్న ప్రొఫెషనల్స్, విద్యార్థుల కోసం నగరంలోని టీ-హబ్ వద్ద ఐబీసీ కాంటినమ్, వెబ్ 3.0 ఆల్ట్ హ్యాక్‌ను ప్రారంభించినట్టు ఐబీసీ మీడియా వెల్లడించింది

 ఐబీసీ కాంటినమ్, వెబ్ 3.0 ఆల్ట్ హ్యాక్‌ను ప్రారంభించిన ఇంటర్నేషనల్ బ్లాక్‌చైన్ కాంగ్రెస్
IBC

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ప్రొఫెషనల్స్, విద్యార్థుల కోసం నగరంలోని టీ-హబ్ వద్ద ఐబీసీ కాంటినమ్, వెబ్ 3.0 ఆల్ట్ హ్యాక్‌ను ప్రారంభించినట్టు ఐబీసీ మీడియా వెల్లడించింది. టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, టీ-హబ్ సీఈవో శ్రీనివాసరావు మహంకాళి, ఐబీసీ మీడియా వ్యవస్థాపకుడు, సీఈవో అభిషేక్ పిట్టీ సమక్షంలో రాష్ట్ర ఐటీఈ అండ్ ఎస్ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఉమ్మడి నిర్వహణ బృందంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రభుత్వ ఏజెన్సీలు, పరిశ్రమ పార్టిసిపెంట్స్, ఐబీసీ మీడియా ఉన్నాయి. ఐబీసీ ఎజెండాకు హెడ్‌లైన్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న పోల్కాడాట్ మద్దతుతో ఇంటర్నేషనల్‌ బ్లాక్‌ చైన్‌ కాంగ్రెస్‌ ఐబీసీ 2.0 రెండో ఎడిషన్‌‌ను కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

సదస్సును ఈసారి ఐబీసీ 2022–23కాంటినమ్‌ నేపథ్యంతో నిర్వహిస్తున్నారు. దేశంలోని మొట్టమొదటి, ఆసియాలో అతిపెద్ద బ్లాక్‌చైన్‌ సదస్సును నిర్వహించిన గౌరవాన్ని హైదరాబాద్‌ అందుకుంది. ఈ సదస్సును 2018లో ఇంటర్నేషనల్‌ బ్లాక్‌చైన్‌ కాంగ్రెస్‌ (IBC) నిర్వహించింది. రెండవ ఎడిషన్‌ 2022–23 కాంటినమ్‌ను అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన స్పీకర్లుతో సమాచార యుక్త, అనుసంధానిత సదస్సులు, నెట్‌వర్కింగ్‌ అవకాశాలతో పరిశ్రమ నాయకులు, ప్రభుత్వ మేథావులను కలుసుకునే అవకాశం కల్పిస్తోంది. ఐబీసీ 2022–23లో మార్గదర్శక కార్యక్రమాలలో ఒకటిగా ఐబీసీ ఎడ్యుకేషన్‌, సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ (ఐబీసీ టెక్‌ వయోజ్‌) నిలుస్తుంది. వెబ్‌ 2.0 సామర్ధ్యం నుంచి ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌ కమ్యూనిటీ వెబ్‌ 3.0 ఇండస్ట్రీ రెడీ డెవలపర్స్‌గా మారడానికి ఇది దోహదపడుతుంది.

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు వర్క్‌షాప్‌లు, బూట్‌క్యాంప్‌లు, హ్యాకథాన్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాంలు, సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌లను అందించడం ద్వారా అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. నాణ్యమైన ప్రతిభావంతులను సృష్టించడం ద్వారా తమ బ్రాండ్లను నిర్మించుకునే అవకాశాన్ని కూడా ఈ కార్యక్రమం కల్పిస్తుంది. ఇది అంతర్జాతీయంగా బ్లాక్‌చైన్‌, వెబ్‌ 3 కంపెనీలు తమ సంస్ధలలో నియామకాలు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. ఈ దిశగా ఐబీసీ ఇప్పుడు ఆల్ట్‌ హ్యాక్‌ను నిర్వహిస్తోంది. ఇది భారతదేశంలో మూడు నగరాలలో జరిగే హ్యాక్‌ ఫెస్ట్‌. దీనిలో గణణీయంగా ఒక కోటి రూపాయల వరకు బహుమతి మొత్తం అందిస్తారు.

ఈ సిరీస్‌లో మొదట ఐబీసీ హ్యాక్ ఫెస్ట్ హైదరాబాద్‌ను ఈ నెల 22న టెక్ మహీంద్రా వద్ద ప్రారంభించారు. దీని ప్రకారం 8 రోజులపాటు హ్యాకథాన్ జరుగుతుంది. ఇందులో భాగంగా శిక్షణ, మేధోమథనం, మెంటార్‌ ఆధారిత స్పీడ్‌ బిల్డింగ్‌ సెషన్స్‌ జరిగి డెమో డేతో ముగుస్తాయి. ఐబీసీ హ్యాకథాన్‌ ఇప్పుడు పార్టిస్పెంట్స్‌కు అంతర్జాతీయ వెబ్‌ 3.0 కంపెనీలు తీర్చిదిద్దిన అనుకూలీకరించిన కోర్సులను అందిస్తోంది. ఇది ప్రత్యక్ష రిక్రూట్‌మెంట్‌కు దోహదపడుతుంది.

హ్యాకథాన్‌ రౌండ్స్‌ తేదీలు

హైదరాబాద్: నవంబర్‌ 22 నుంచి నవంబర్‌ 29 వరకు

విశాఖపట్నం: డిసెంబర్‌ 10 నుంచి 18 వరకు

బెంగళూరు: జనవరి 2023 మొదటి వారం

Updated Date - 2022-11-22T21:28:37+05:30 IST