నాలుగో విడత ఫార్మేటివ్‌ పరీక్షలు రద్దు!

ABN , First Publish Date - 2022-03-05T16:50:48+05:30 IST

పాఠశాల విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్‌ పూర్తికాకపోవడంతో నాలుగో విడత ఫార్మేటివ్‌ పరీక్షల్ని విద్యాశాఖ రద్దు చేయాలని నిర్ణయించినట్లు

నాలుగో విడత ఫార్మేటివ్‌ పరీక్షలు రద్దు!

పాఠశాల విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్‌ పూర్తికాకపోవడంతో నాలుగో విడత ఫార్మేటివ్‌ పరీక్షల్ని విద్యాశాఖ రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ ఏడాది కొవిడ్‌ కారణంగా ఆగస్టు 16వ తేదీన పాఠశాలలు తెరిచారు. దానికి తగినట్లుగానే సిలబ్‌సను కూడా తగ్గించారు. అయినా ఆ మేరకు కూడా సిలబస్‌ పూర్తికాలేదని సమాచారం. తొలి మూడు ఫార్మేటివ్‌ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా నాలుగో ఫార్మేటివ్‌ పరీక్షల్లో మార్కులను ఇవ్వాలని జిల్లా విద్యాశాఖాధికారులకు నిర్దేశించినట్లు తెలిసింది. 

Updated Date - 2022-03-05T16:50:48+05:30 IST