పాస్‌ మార్కులతో ఎంట్రన్స్‌కు ఓకే!

ABN , First Publish Date - 2022-03-05T17:35:43+05:30 IST

ఎంసెట్‌ సహా ఇతర ప్రవేశ పరీక్షలు రాయడానికి కనీస మార్కులనే అర్హతగా నిర్ణయించాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించనున్నారు. ఎంసెట్‌, లాసెట్‌ వంటి ప్రవేశ పరీక్షల ద్వారా వివిధ కోర్సుల్లో చేరడానికి ఇంటర్మీడియట్‌లో 45 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

పాస్‌ మార్కులతో ఎంట్రన్స్‌కు ఓకే!

ఈసారి కూడా అర్హత మార్కుల విధానం రద్దు

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్న అధికారులు

పాస్‌ మార్కులతో ఎంట్రన్స్‌ పరీక్షలకు ఓకే...!


హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఎంసెట్‌ సహా ఇతర ప్రవేశ పరీక్షలు రాయడానికి కనీస మార్కులనే అర్హతగా నిర్ణయించాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించనున్నారు. ఎంసెట్‌, లాసెట్‌ వంటి ప్రవేశ పరీక్షల ద్వారా వివిధ కోర్సుల్లో చేరడానికి ఇంటర్మీడియట్‌లో 45 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.


జనరల్‌ విద్యార్థులకు 45 శాతం, రిజర్వుడ్‌ కేటగిరీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు అవసరం. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా వార్షిక పరీక్షలను రద్దుచేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రవేశ పరీక్షలకు అర్హత మార్కుల విధానాన్ని కూడా రద్దు చేశారు. అయితే ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫస్టియర్‌  పరీక్షలను కూడా నిర్వహించారు. అందులో ఫెయిలైన విద్యార్థులను కనీస మార్కులతో పాస్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా అర్హత మార్కుల నిబంధనను అమలు పరచకూడదనే నిర్ణయానికి అధికారులు వచ్చారు. 

Read more