26 నుంచి బడులకు దసరా సెలవులు

ABN , First Publish Date - 2022-09-13T17:28:27+05:30 IST

రాష్ట్రం(Telangana)లో పాఠశాలలకు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 8 వరకు ప్రభుత్వం సెలవులు(holidays) ప్రకటించింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాధికారులకు

26 నుంచి బడులకు దసరా సెలవులు

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం(Telangana)లో పాఠశాలలకు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 8 వరకు ప్రభుత్వం సెలవులు(holidays) ప్రకటించింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాధికారులకు సర్క్యులర్‌ పంపించింది. వచ్చే నెల 5న దసరా పండుగ. అందుకు 10 రోజుల  ముందుగానే పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ నెల 25, అక్టోబరు 9వ తేదీ ఆదివారాలు కావడంతో మొత్తం 15 రోజుల పాటు సెలవులు కొనసాగనున్నాయి. పాఠశాలలు తిరిగి అక్టోబరు 10న ప్రారంభమవుతాయి.

Read more