డిగ్రీ, పీజీ వార్షిక పరీక్షలు ఫిబ్రవరిలో

ABN , First Publish Date - 2022-10-27T15:44:16+05:30 IST

రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో డిగ్రీ, పీజీ కోర్సులకు సంబంధించిన వార్షిక పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించాలని యూజీసీ నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా షెడ్యూల్‌ను విడుదల

డిగ్రీ, పీజీ వార్షిక పరీక్షలు ఫిబ్రవరిలో

అన్ని వర్సిటీల్లో ఒకే సారి ఇంటర్నల్స్‌.. యూజీసీ షెడ్యూల్‌

హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో డిగ్రీ, పీజీ కోర్సులకు సంబంధించిన వార్షిక పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించాలని యూజీసీ నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 9వ తేదీ నుంచి డిగ్రీ కోర్సులకు, ఫిబ్రవరి 27వ తేదీ నుంచి పీజీ కోర్సులకు వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఈ షెడ్యూల్‌ను రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు పాటించాల్సి ఉంటుందని యూజీసీ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు వేర్వేరు యూనివర్సిటీలకు వేర్వేరు అకడమిక్‌ క్యాలెండర్లు అమల్లో ఉండేవి. అయితే ఈ ఏడాది నుంచి అన్ని వర్సిటీలకు ఒకే విద్యా క్యాలెండర్‌ను అమలు చేయాలని యూజీసీ. అందులో భాగంగానే కామన్‌ షెడ్యూల్‌ను ప్రకటించింది.

ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాందీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ, మహిళా యూనివర్సిటీల్లోని డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులందరికీ ఒకేసారి తరగతులను ప్రారంభించి, అందరికీ ఒకే షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్నల్స్‌, సెమిస్టర్‌ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. యూజీసీ తాజా షెడ్యూల్‌ను బట్టి డిగ్రీ కోర్సుల మొదటి ఇంటర్నల్స్‌ను డిసెంబరు 8, 9వ తేదీల్లో, రెండవ ఇంటర్నల్స్‌ను జనవరి 23, 24వ తేదీల్లో నిర్వహించాలి. పీజీ కోర్సుల్లో అడ్మిషన్లను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలి. డిసెంబరు 22, 23వ తేదీల్లో మొదటి ఇంటర్నల్స్‌ను, ఫిబ్రవరి 9, 10వ తేదీల్లో రెండో ఇంటర్నల్స్‌ నిర్వహించాలి. కాగా, వచ్చే నెల 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులను ప్రారంభించాలని అఽధికారులు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు ఆయా యూనివర్సిటీలు, కాలేజీలకు సమాచారం అందించినట్టు తెలిసింది.'

dg.jpg

Updated Date - 2022-10-27T15:44:18+05:30 IST