అమెరికా కాన్సులేట్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్.. ఎవరికంటే..!

ABN , First Publish Date - 2022-10-07T21:39:15+05:30 IST

హైదరాబాద్‌లోని మౌలానా అజాద్ ఉర్దూ యూనివర్సిటీ ఇంగ్లీష్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అమెరికా కాన్సులేట్‌లోని రీజినల్ ఇంగ్లీష్ ఆఫీస్‌లో ఇంగ్లీష్ లాంగ్వేజ్

అమెరికా కాన్సులేట్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్.. ఎవరికంటే..!

హైదరాబాద్‌లోని మౌలానా అజాద్ ఉర్దూ యూనివర్సిటీ ఇంగ్లీష్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  అమెరికా కాన్సులేట్‌లోని రీజినల్ ఇంగ్లీష్ ఆఫీస్‌లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫెలో వివిన్నే థామస్ కోర్సు ట్రైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎనిమిది వారాల ఈ ప్రోగ్రామ్ అక్టోబర్ 17 నుంచి ఆరంభమవుతోంది. యూజీ, పీజీ చదువుతున్న ఫైనలియర్ విద్యార్థులు అంతా ఈ కోర్సులో చేరవచ్చు. సోమవారం నుంచి గురువారం వరకు క్లాసులు మూడు బ్యాచీలుగా జరుగుతాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు, మూడు నుంచి నాలుగు, నాలుగున్నర నుంచి అయిదున్నర గంటల వరకు బ్యాచీలవారీగా క్లాసులు జరుగుతాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 11లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

రిజిస్ట్రేషన్ లింక్: https://forms.gle/jWBk4P2Wt4haSp4z8

ఈమెయిల్ ఐటీ: manuuplacements@gmail.com

Updated Date - 2022-10-07T21:39:15+05:30 IST