బ్రిడ్జి కోర్సు శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ

ABN , First Publish Date - 2022-03-05T16:38:46+05:30 IST

ఐటీఐ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు పాలిటెక్నిక్‌ (డిప్లమా)లో నేరుగా రెండో సంవత్సరంలో చేరడానికి, బ్రిడ్జి కోర్సులో శిక్షణ పొందడానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తాండ్రపాడు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌, కన్వీనర్‌ రవీంద్రబాబు శుక్రవారం తెలిపారు.

బ్రిడ్జి కోర్సు శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ

కర్నూలు(ఎడ్యుకేషన్‌), మార్చి 4: ఐటీఐ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు పాలిటెక్నిక్‌ (డిప్లమా)లో నేరుగా రెండో సంవత్సరంలో చేరడానికి, బ్రిడ్జి కోర్సులో శిక్షణ పొందడానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తాండ్రపాడు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌, కన్వీనర్‌ రవీంద్రబాబు శుక్రవారం తెలిపారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి బ్రిడ్జి కోర్సుల శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. శిక్షణ అనంతరం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఏప్రిల్‌ 6 నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే పాలిటెక్నిక్‌ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశం పొందడానికి అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ఈ నెల 7వ తేదీలోగా సమర్పించాలని తెలిపారు. వివరాల కోసం ఇ.తాండ్రపాడు ప్రభుత్వ ఐటీఐ కన్వీనర్‌, ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలని తెలిపారు.

Updated Date - 2022-03-05T16:38:46+05:30 IST