ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం! మంత్రి చొరవతో ముందుకొచ్చిన హరేకృష్ణ సంస్థ

ABN , First Publish Date - 2022-02-19T21:16:05+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నభ్యసిస్తున్న విద్యార్థులకు అల్పాహార సమస్య తీరనుంది. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సూచనమేరకు తొలిదశలో మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలోని ప్రభు త్వ పాఠశాలల్లో అల్పాహారం అందించేందుకు హరేకృష్ణ..

ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం! మంత్రి చొరవతో ముందుకొచ్చిన హరేకృష్ణ  సంస్థ

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ  పాఠశాలల్లో విద్య నభ్యసిస్తున్న విద్యార్థులకు అల్పాహార సమస్య తీరనుంది. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సూచనమేరకు తొలిదశలో మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలోని ప్రభు త్వ పాఠశాలల్లో అల్పాహారం అందించేందుకు హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ఛారిట బుల్‌ ఫౌండేషన్‌  ముందుకు వచ్చింది.  మంత్రి సూచన మేరకు అరబిందో ఫార్మా కంపెనీ, ఇతర దాతలు ఈ పథకానికి సహాయం చేసేందుకు అంగీకరిం చారు.  నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని 5 వేల మందికిపైగా విద్యార్థులకు శనివారం ఉదయం అల్పాహారం అందించనున్నారు. మహబూబ్‌ నగర్‌ మండలంలోని కోడూరు వద్ద నిర్మించిన హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ఛారి టబుల్‌ ఫౌండేషన్‌ కిచెన్‌షెడ్‌ వద్ద శనివారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఈ కా ర్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.


టిఫిన్‌ సమస్యకు పరిష్కారం..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది.  ఉదయం ప్రత్యేక తరగతులకు వచ్చే వి ద్యార్థులకు టిఫిన్‌ సమస్య తీరనున్నది. ఉదయం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించిన సమయంలో కొన్ని స్కూళ్లలో దాతలు పదోతరగతి పిల్లలకు అల్పాహారాన్ని అందించేవారు. మరి కొన్ని పాఠశాలల్లో ఆల్పాహారం లేక విద్యా ర్థులు ఆకలితో ఉండేవారు. గ్రామాల్లో పర్యటించినప్పుడు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ దృష్టికి ఆల్పాహార సమస్య రావడంతో  పరిష్కారంపై దృష్టి సారించారు. ఇం దులో భాగంగానే హరేకృష్ణ మూవ్‌మెంట్‌ సంస్థని, అరబిందో పార్మా ఫౌం డేషన్‌ వైస్‌ఛైర్మన్‌ నిత్యానందరెడ్డిని కోరారు. మంత్రి కోరిక మేరకు తొలిదశలో మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలోని అన్ని స్కూళ్లలో ఈ అల్పాహారం అం దించే కార్యక్రమం నేటి నుంచి అమల్లోకి రానున్నది.  


అల్పాహారం ఐదు రకాలు

ప్రతీ రోజు ఉదయం ఐదు రకాల అల్పాహారం విద్యార్ధులకు అందిస్తున్నట్లు హరేకృష్ణమూవ్‌మెంట్‌  ఫౌండేషన్‌ సభ్యులు తెలిపారు. ఇడ్లీ, వడ, దోస, పూరీ, కిచిడి రోజుకోరకం అందిస్తామని, విద్యార్థులకు సంపూర్ణ పోషకాలు లభించేలా ఈ ఆహారం ఉంటుందని తెలిపారు. ఆల్పాహారం వేడి తగ్గకుండా తమ ప్రత్యేక వాహనాల్లో  విద్యార్థులకు అందిస్తామని వెల్లడించారు. 


విద్యార్ధుల ఆకలి తీర్చాలనే : మంత్రి 

రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ల బలోపేతానికి అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేస్తున్నాం. నేను ప్రభుత్వ స్కూళ్లని సందర్శించిన సమయంలో పిల్లలు ఉదయం ఏమీ తినకుం డా ఖాళీ కడుపుతోనే స్కూల్‌కి వస్తున్న విషయం నాకు చెప్పారు.  చాలా బాధ కలిగింది. హరేకృష్ణ మూవ్‌మెంట్‌, అరబిందో ఫార్మా కంపెనీ వారి ముందుకు రావడంతో తొలిదశలో మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాం. త్వరలో జిల్లా అంతటా ఈ పథకాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తాం.

Read more