APEAP సెట్‌ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2022-07-26T16:55:43+05:30 IST

ఈఏపీ సెట్‌ 2022 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.

APEAP సెట్‌ ఫలితాలు విడుదల

విజయవాడ: ఏపీఈఏపీ సెట్‌(APEAP set) 2022 ఫలితాలు(result release) విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Education Minister Botsa Satyanarayana) విడుదల చేశారు. ఇంజనీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సులలో ప్రవేశానికి ఏపీ ఈఏపీసెట్‌-2022 సెట్ నిర్వహించారు. ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు ఈఏపీ సెట్‌ నిర్వహించారు. మొత్తం 3,01,172 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా 2,82,496 మంది పరీక్ష రాశారు. ఇంజనీరింగ్‌లో 89.12 శాతం, అగ్రికల్చర్‌లో 95.06 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

Updated Date - 2022-07-26T16:55:43+05:30 IST