AP TET ఆగస్టు-2022 నోటిఫికేషన్
ABN , First Publish Date - 2022-06-11T18:29:46+05:30 IST
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(ఏపీ టెట్ ఆగస్టు -2022) నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభత్వానికి చెందిన పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఉపాధ్యాయ నియామక పరీక్షలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(ఏపీ టెట్ ఆగస్టు -2022) నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభత్వానికి చెందిన పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఉపాధ్యాయ నియామక పరీక్షలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. 1 నుంచి 5వ తరగతి వరకు బోధించాలనుకునే అభ్యర్థులు టెట్ పేపర్-1(ఎ, బి); 6 నుంచి 8 తరగతుల బోధనకు పేపర్-2(ఎ, బి)లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
అర్హతలు: అభ్యర్థులు రాయదలచుకున్న పేపరును బట్టి ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీతో డీఈడీ/బీఈడీ/లాంగ్వేజ్ పండిట్/యూజీడీపీఈడీ/డీపీఈడీ/బీపీఈడీ లేదా తత్సమానం ఉత్తీర్ణులైన ఉండాలి.
కమ్యూనిటీ వారీగా ఉత్తీర్ణత మార్కులు:
1. ఓసీ(జనరల్)- 60శాతం మార్కులు ఆపైన
2. బీసీ-50 శాతం మార్కులు ఆపైన
3. ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/ఎక్స్ సర్వీస్‌మన్- 40 శాతం మార్కులు ఆపైన
పరీక్ష కేంద్రాలు: ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాలతోపాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఒడిషా
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష
పరీక్ష ఫీజు: రూ.500
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
పరీక్షల నిర్వహణ: 2022 ఆగస్టు 6 నుంచి 21వ తేదీ వరకు
వెబ్‌సైట్: https://aptet.apcfss.in/